Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha warning: ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సామ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

Samantha warning: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యలు నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి ఏడాది అవుతోంది. అయితే విడాకుల తర్వాత మాత్రం ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది. తన పనుల్లో తాను తలమునకలైంది. అయితే హీరో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగ చైతన్య శోభితాతో డేటింగ్ లో ఉన్నట్లు… సమంత కావాలనే తన సోషల్ మీడియా టీమ్ తో ఈ రూమర్స్ ను ప్రచారం చేయిస్తోందని చైతూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, అదే అబ్బాయిపై వస్తే అమ్మాయి చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ అంటూ సామ్ నాగ చైతన్య ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. మేమెప్పుడో విడిపోయాం ఇకనైనా మీ పనిపై, మీ కుటుంబంపై దృష్టి పెట్టండంటూ చెప్పింది. సామ్ ఇటీవలే నటించిన యశోదా, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

Advertisement
Exit mobile version