Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu July 15 Today Episode: వసు జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోతున్న రిషి.. మళ్లీ దగ్గరవుతున్న వసు..?

Guppedantha Manasu july 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి చేసే కుట్ర వెనుక నువ్వు ఉన్నావు అని రిషికి చెప్తాను అంటూ దేవయానని బెదిరిస్తుంది జగతి. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుదల జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వసు వేసిన పూలదండను చూస్తూ అదనని మెడలో వేసుకుని ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు ల్యాబ్ లో అన్న మాటలు గుర్తు నీ మనసులో నేను సరిగ్గా చదవలేక పోతున్నానా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వసుధార, రిషి రూమ్ దగ్గర వరకు వచ్చి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటూ మళ్లీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది.

Guppedantha Manasu july 15 Today Episode :sakshi fires on rishi and vasu in todays guppedantha manasu serial episode

ఆ తర్వాత రూమ్ కి వెళ్ళగా అక్కడ సాక్షి, వసు ఫోన్ లాక్కొని చూడగా అక్కడ రిషి ఫోటో ఉండడంతో సాక్షి కోప్పడుతుంది. రిషి ఫోటోతో నీకేం పని అని అనగా నా ఫోన్ తీసుకుని తప్పు చేశావు నా ఫోన్ నా ఇష్టం నేను ఎవరి ఫోటోలు అయినా చూస్తాను అంటూ సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.ఆ తర్వాత నేను ఇప్పుడు రిషి సార్ రూమ్ దగ్గర నుంచి వస్తున్నాను అనటంతో సాక్షి కోపంతో రగిలిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం రిషి, వసు గురించి ఆలోచిస్తూ నైట్ మొత్తం వర్క్ చేసి ఇంకా నిద్ర లేవలేదా అని అనుకుంటూ వసుధార రూమ్ లోకి వెళ్తాడు. వసు తన రూమ్ లో పెన్సిల్ కనిపించకపోయేసరికి వెతుకుతూ ఉంటుంది.

Guppedantha Manasu july 15 Today Episode: వసుధార టెన్షన్.. నా మనసులో మీరే ఉన్నారు సార్..!

వసుధార కొత్తగా కనిపిస్తోంది అంటూ రిషి అలా వసు వైపు అలా చూస్తూ ఉండగా, వసు కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రిషి వసుధారకి మరింత దగ్గరగా వెళ్లేసరికి వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసు జడలో ఉన్న పెన్సిల్ ని తీసి ఇలా కూడా ఉపయోగిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది అని రిషి అనగా అప్పుడు వసు నా మనసులో మీరు ఉన్నారు సార్ ఆ విషయం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు అని మనసులో అనుకుంటుంది.

Advertisement

ఇక ఆ తర్వాత సాక్షి దేవయాని కలసి రిషి విషయంలో ప్లాన్లు వేస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని సాక్షికి కాఫీ ఇచ్చి రిషి రూమ్ కి వెళ్ళమని చెబుతుంది. ఇంతలో ధరణి అక్కడికి రావడంతో అనవసరంగా ధరణిపై విరుచుకుపడుతుంది దేవయాని. మరొకవైపు గౌతమ్ కాఫీ తాగలేదు అని అటు ఇటు తిరుగుతూ రిషి మీద చిందులు వేస్తూ ఉంటాడు. ఇంతలోనే సాక్షి కాఫీ తీసుకొని రావడంతో సాక్షి ఇలా అనుకున్నాను లేదో ఇంతలోనే కాఫీ తీసుకొని వచ్చావు థాంక్స్ అంటూ ఒక కాఫీ తాను తాగి తర్వాత ఇంకొక కాఫీ రిషికి ఇస్తాడు.

అప్పుడు సాక్షి తన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధార అక్కడికి రాగా అప్పుడు గౌతమ్ కాఫీ తాగావా వసు అని అడగగా లేదు సార్ తాగాలని ఉంది తల బద్దలవుతుంది అని అనగా వెంటనే రిషి సరే కాఫీ షేర్ చేసుకుందాం వసు అని చెప్పి సాసర్ తను తీసుకొని కప్పు వసుధారకి ఇస్తాడు. అది చూసి సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Read Also : Guppedantha Manasu july 14 Today Episode : వసుధార దెబ్బకు భయంతో వణికిపోతున్న సాక్షి.. దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జగతి..? 

Advertisement
Exit mobile version