Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu November 26 Today Episode : రిషిని కలవరిస్తున్న జగతి.. తల్లికి సేవలు చేస్తున్న రిషి?

Guppedantha Manasu November 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి వసుధారని ఓదారుస్తూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ మహేంద్ర ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు ఏంటి గౌతమ్ ఇలా జరిగింది అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ అంకుల్ మీరేం బాధపడకండి ఏం కాలేదు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. మరొకవైపు వస్తారా జగతి వైపు చూస్తూ ఎమోషనల్ అవుతూ నేను మిమ్మల్ని కలపడం ఏంటి మేడం మీ రక్తసంబంధం మిమ్మల్ని కలుపుతోంది అని బాధపడుతూ ఉండగా వెంటనే నర్స్ మీరు కొద్దిసేపు బయటికి వెళ్ళండి అని అంటుంది.

Guppedantha Manasu November 26 Today Episode

అప్పుడు వసుధర బయటికి వెళ్తూ జగతి దగ్గరికి వెళ్లి మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు మీకేం కాదు మేడం మీరు త్వరగా కోరుకుంటారు మీ అబ్బాయి మిమ్మల్ని కాపాడుకుంటారు. కొడుకుగా తన బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరొకవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి జగతి వైపు చూస్తూ గతంలో జగతి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.

Advertisement

అప్పుడు జగతి రిషి రిషి అని కలవరించడంతో రిషి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మేడం మీకేం కాదు,మీకు నేను ఏం కానివ్వను అని రిషి ఎక్కడి నుంచి వెళ్తుండగా జగతి రిషి చేయి పట్టుకుంటుంది. అప్పుడు రిషి జగతి వైపు చూడడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా రిషి ఆ కన్నీళ్లను తుడుస్తాడు. అప్పుడు రిషి జగతితో ఎమోషనల్ గా మాట్లాడుతూ మీరు స్పృహలో లేకపోయినా నేను మాట్లాడిన మాటలు మీ మనసుకు చేరాయని నేను అనుకుంటున్నాను మేడం మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి అని రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా మళ్లీ రిషి మేము నీ దగ్గరికి వస్తున్నాము అంటూ జగతి కలవరిస్తూ ఉంటుంది.

Guppedantha Manasu నవంబర్ 26 ఎపిసోడ్ : వసుధార, మహేంద్ర, గౌతమ్ సంతోషం..మహేంద్ర ఎమోషనల్.. 

అప్పుడు రిషి జగతి తల నిమిరి, చెవులో మీకేం కాదు మేడం అని చెప్పి బయటకు వెళ్తుంటాడు. అప్పుడు జగతి దాహం దాహం అనడంతో రిషి బాధపడి జగతికి ప్రేమతో నీళ్లు తాగిస్తాడు. అది బయట నుంచి చూసిన వసుధార మహేంద్ర గౌతమ్ వాళ్లు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అంకుల్ లోపలికి వెళ్దాం పదండి అని అనడంతో వద్దులే గౌతమ్ ఆ తల్లి కొడుకులను కాసేపు అలాగే వదిలేయ్ అని అంటాడు. ఆ తర్వాత రిషి తన తల్లికి నీళ్లు తాపి సేవలు చేస్తూ ఉంటాడు.

ఇంతలోనే దేవయాని దంపతులు వస్తారు. ఆ తర్వాత రిషి బయటికి రావడంతో మహేంద్ర రిషిని ఎమోషనల్ గా హత్తుకుంటాడు. అప్పుడు మహేంద్ర రిషి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుండగా వెంటనే రిషి డాడ్ మీరు ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు ఈ వివరాలన్నీ నేను ఏమీ అడగను. ఇకపై నన్ను విడిచి వెళ్ళొద్దండి డాడీ నేను మీరు లేకుండా ఉండలేను అనడంతో మహేంద్ర ఎమోషనల్ హత్తుకుంటాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu: మహేంద్ర, జగతిలను చూసి కన్నీళ్లు పెట్టిన వసు, రిషి.. టెన్షన్ పడుతున్న గౌతమ్?

Exit mobile version