Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu : కన్నీళ్లు పెట్టిన వసుధార.. వసుధార కన్నీళ్లు తుడిచిన రిషి..?

Guppedantha Manasu July 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్ ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కి సాక్షి ఎదురుపడగా నీతో ఒక విషయం చెప్పాలి అని వద్దులే మళ్ళీ చెబుతాను అని అనగా వెంటనే సాక్షి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు నాకు సమయం దొరకాలి కదా అని అనగా వెంటనే గౌతమ్ మీరు ఇంతవరకు చదువుకున్నారు ఎందుకు మధ్యలోనే చదువును ఆపేశారు ఎందుకు లండన్ నుంచి వచ్చారు ఇలాంటి ప్రశ్నలు వేయడంతో సాక్షి కోప్పడుతూ ఉంటుంది.

Guppedantha Manasu July 26 Today Episode

ఆ తర్వాత గౌతమ్ సాక్షికి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వాచ్మెన్ వసుధర బ్యాగు తీసుకొని వెళుతూ ఉండగా రిషి ఎదురుపడి వసు బ్యాగ్ లో ఉన్న చాక్ పీసులను గమనిస్తాడు. ఆ తర్వాత రిషి క్లాస్ రూమ్ లోకి వెళ్లి వసుధార బ్యాగులో ఉన్న చాక్ పీసులను చూసి బోర్డుపై ఉన్న బొమ్మను తానే గీసింది అనుకుంటాడు. ఆ తర్వాత వెనుక బెంచ్ లో కూర్చుని ఉండగా ఇంతలోనే వసుధర అక్కడికి వచ్చి రిషి ని గమనించకుండా ఉంటుంది. పుష్ప రిషి సార్ వచ్చాడా అని అనగా పుష్ప వెనక్కి తిరిగి చూడడంతో రాలేదు అని చెప్పడంతో మౌనంగా ఉంటుంది పుష్ప. అప్పుడు రిషి గురించి వసుధార నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

ఆ తర్వాత రిషి బోర్డుపై బొమ్మను చెరిపేస్తూ ఇలాంటి బొమ్మలు ఇంకెప్పుడు గీయొద్దండి అని అంటాడు. ఆ బొమ్మను చెరిపీయకుండా వసునీ పిలిచి చదువుల పండుగ గురించి వివరించమని చెప్పి తర్వాత బోర్డుపై ఉన్న బొమ్మను చెరిపేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ కి వెళ్లి వసుధార గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసుధార తన క్యాబిన్ కి వస్తుంది. అప్పుడు రిషి చదువుల పండుగను చాలా శ్రద్ధగా చేయాలి అని చెబుతూ చదువుల పండుగకు సంబంధించిన అన్ని విషయాలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయని అంటాడు.

Advertisement

Guppedantha Manasu : బోర్డుపై బొమ్మను వేసింది ఎవరన్న రిషి.. 

rishi-fires-on-vasu-in-todays-guppedantha-manasu-serial-episode

ఈ పెన్ డ్రైవ్ జాగ్రత్తగా పెట్టుకో అని వసుకీ చెబుతాడు. మరొకవైపు సాక్షి జగతి చెప్పిన పనిని చేస్తూ ఉంటుంది. అప్పుడు జగతి వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తున్నావ్ కానీ నీ ప్రవర్తన బాగాలేదు అనడంతో సాక్షి ఎదురు సమాధానం చెబుతూ ఉంటుంది. ఇక వెంటనే జగతి సాక్షికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అంతేకాదు నీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సెన్స్ లేదు, బేసిక్ సెన్స్ కూడా లేదు అనడంతో సాక్షి నువ్వు లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ మీటింగ్ హాల్లో ఉండగా అప్పుడు రిసీ చదువులు పండుగ గురించి చెబుతూ దానిని గొప్పగా చేయాలి అని చెబుతూ ఉంటాడు.

ఆ తరువాత వసు నీకు ఇందాక పెన్ డ్రైవ్ ఇచ్చాను కదా అది ఇవ్వు అనడంతో అప్పుడు వసు బ్యాగ్ మొత్తం వెతికి లేదు అని అంటుంది. వెంటనే సాక్షి నాకు తెలిసి వసు ధార ఇలా చేస్తుందని తనకు జాగ్రత్త లేదు అంటూ వస ధరపై లేనిపోని మాటలను చెబుతూ ఉంటుంది. ఇలా పనిపై రెస్పాన్సిబులిటీ లేని వాళ్ళని పెట్టుకుంటే చదువులో పండుగ ఎలా చేస్తావు. ఇది మరొకసారి రిపీట్ కాకుండా ఉండాలి అంతే మంచి పనిష్మెంట్ ఇవ్వు అనడంతో వెంటనే రిషి అవును సాక్షి ఒక మంచి పనిష్మెంట్ ఇస్తాను అని అంటాడు. వెంటనే సాక్షి సంతోషపడుతూ ఉండగా జగతి మహేంద్ర షాక్ అవుతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో రిషి , తన క్యాబిన్లో వసుధారని తిడుతూ ఉండగా అప్పుడు తప్పు మొత్తం నాదే సార్ అంటూ ఎమోషనల్ అవుతుంది.అప్పుడు రిషి,వసు కన్నీళ్లు తుడుస్తాడు.

Read Also : Guppedantha Manasu july 25 Today Episode : దేవయాని పై కౌంటర్లు వేసిన ధరణి..వసు కీ పనిష్మెంట్ ఇచ్చిన రిషి..?

Advertisement
Exit mobile version