Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu : కోపంతో రగిలిపోతున్న వసు.. మహేంద్ర పై విరుచుకుపడ్డ రిషి..?

Guppedantha Manasu March 15th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి జరిగిన విషయం గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి రిషికి లేనిపోని మాటలు అని చెప్పి మరింత రెచ్చగొడుతుంది. జగతి గురించి మరింత నెగిటివ్ గా చెబుతుంది. దేవయాని మాటలు నిజమే అని నమ్మిన రిషి జగతిపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. కోపంతో రగిలి పోతున్న రిషి ని చూసి దేవయాని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆ తరువాత రిషి ఉదయాన్నే కాలేజీకి త్వరగ రా అని వసు కి మెసేజ్ చేస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వసు తొందరగా రెడీ అయ్యి రిషి దగ్గరికి వెళుతుంది. అప్పుడు రిషి ఒక లెటర్ ఇచ్చి ఇది మీ జగన్ కి మేడంకి ఇవ్వమని చెబుతాడు. ఇక ఆ లెటర్ ని తీసుకొని వెళ్లి వసు, జగతికి ఇస్తుంది. జగతి ఆ లెటర్ ను చదివి ఆశ్చర్యపోయి, ఆ పేపర్ ను అక్కడే వదిలేసి కోపంగా వెళ్ళిపోతుంది.

ఇక వసుధారా ఏం జరిగింది మేడం అని పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా జగతి వెళ్ళిపోతుంది. అప్పుడు జగతి డౌట్ వచ్చి ఆ పేపర్ ను చదవ గా అందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చేసినట్టు రిషి లెటర్ లో రాశాడు. అది చూసిన వసుధార కోపంతో రగిలిపోతూ దగ్గరికి వెళుతుంది. ఇక రిషి పై వసు కోపంతో విరుచుకుపడుతుంది.

Advertisement
Guppedantha Manasu March 15th Today Episode

అప్పుడు రిషి తెలివిగా కవర్ చేసుకుందామని ప్రయత్నించగా ఏ మాత్రం తగ్గకుండా వసుధార ఇంకా కోప్పడుతూ మేడం మీ కాలేజీకి వద్దు అని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఆ తర్వాత వసు మాటలకు కోపం తెచ్చుకున్న రిషి ఆమె పై విరుచుకు పడతాడు. వీరిద్దరూ కొట్లాడుకుంటున్న విషయం దూరం నుంచి మహేంద్ర చూస్తాడు.

ఇక మహీంద్రా అక్కడికి రాగా వసు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు మహేంద్ర ఏం చేస్తున్నావ్ రిషి అని అడగగా.. ఇది నా నిర్ణయం డాడ్ అంటూ మహేంద్ర ఫై కోప్పడతాడు రిషి. మరొకవైపు వసు ఇంటికి వెళ్లి తలుపులు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu: రిషి ఫై మండిపడ్డ వసుధార.. జగతి ఏం చేయనుంది..?

Advertisement
Exit mobile version