Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu November 16 Today Episode : రిషిని హత్తుకుని ఎమోషనల్ అయిన వసు.. మహేంద్ర దంపతులను వెతికే పనిలో రిషి, ఫణీంద్ర?

Guppedantha Manasu November 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార గౌతమి నిలదీస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార సర్ జగతి మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిస్తే చెప్పండి సార్ అని అంటుంది. ఇప్పుడు గౌతమ్ చూడు వసుధార ఈ మాట నా ముందు అంటే అన్నావు కానీ రిషి ముందు అనకు నా పీక పిసికేస్తాడు అని అంటాడు గౌతమ్. ఏమో మీరిద్దరూ ఒకటైతే వారు వస్తారేమో అని నాకు అనిపించింది అందుకే చెప్పాను అని అంటాడు గౌతమ్. ఇంకా ఎన్ని రోజులు ఇలా వసుధర వాడేమో రిషి సార్ కోసం నువ్వు ఏమో జగతి మేడం కోసం ఇంకెన్నాళ్లు ఇలా వెయిట్ చేస్తారు అని అనంగా వెంటనే వసుధార వాళ్ళు వచ్చే వరకు సార్ అని అంటుంది.

Advertisement

మేడం కోసం నేను ఇంటర్వ్యూ కూడా వాయిదా వేసుకున్నాను సార్ అనడంతో ఏంటి వస్తారా నువ్వు చెప్పేది అని అనగా ఆన్సర్ నా విజయానికి కారణమైన జగతి మేడం లేకుండా నేను ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అంటుంది వసుధార. అప్పుడు ఏమో వసుధార మీరిద్దరూ ఒకటైతే మేలేమో అని అనగా జగతి మేడం మహేంద్ర సర్ లేకుండా వాళ్లు రాకుండా మేమిద్దరం ఒక్కటే ఇవ్వడం అన్నది జరగదు అసంభవం సార్ అని అక్కడికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరొకవైపు మీడియా విలేకర్ రిషికి ఫోన్ చేసి వసుధార ఇంటర్వ్యూ వద్దని చెప్పింది సార్ అనడంతో రిషి షాక్ అయ్యి నేను మల్లి కాల్ చేస్తాను అని అక్కడి నుంచి కోపంగా బయలుదేరుతాడు. మరొకవైపు వసుధార గౌతమ్ అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఇంటికి ఆటోలో వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి కోపంగా బయలుదేరగా ఇంతలో అక్కడికి గౌతమ్ రావడంతో వసుధార కనిపించిందా అని అనగా ఇప్పుడే వెళ్లిపోయిందిరా ఇందాకే తనతో మాట్లాడాను అని అంటాడు గౌతం.

ఏం మాట్లాడారు అని అనగా అప్పుడు గౌతమ్ జరిగిన విషయం చెప్పడంతో వెంటనే సీరియస్ అయ్యి ఇది కాలేజీ కాటి బతికిపోయావు లేదంటే చెంపలు చెల్లుమనిపించే వాడిని ఇటువంటి సలహాలు ఇంకెప్పుడు ఇవ్వద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు డాడ్ వాళ్ళు లేకుండా అలాంటివన్నీ జరగవు ఇంకొకసారి ఇలాంటి చెత్త ఆలోచనలు చేయకు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి మరొకవైపు దేవుడు దగ్గరికి వెళ్లిన వసుధార అక్కడ దేవుడు తో తన బాధలన్నీ చెప్పుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

Advertisement

అప్పుడు వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసుధార ని రిషి ఒకచోటకి పిలుచుకొని వెళ్తాడు. ఎందుకు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పావు వసుధార అనడంతో మౌనంగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నువ్వు నీ పర్సనల్గా భావించినప్పటికీ నీ ఇంటర్వ్యూ వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు అని అంటాడు రిషి. అప్పుడు రిషి తన మాటలతో వసుధార న్ కన్విన్స్ చేయాలని చూస్తాడు.

ఈ క్రమంలోనే వసుధర రిషి ని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవడంతో రిషి ఓదార్చి అక్కడ నుంచి వసుధార ని తన ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు గౌతమ్, ఫణీంద్ర జగతి దంపతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు గౌతం అనడంతో లేదు పెదనాన్న ప్రతి ఒకచోట వెతుకుతున్నాము ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నాము అని అబద్ధాలు చెబుతాడు గౌతం. అప్పుడు ఫణీంద్ర పోలీస్ స్టేషన్ అనడంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార లు వస్తారు. అప్పుడు ఫణీంద్ర మహేంద్ర గురించి మాట్లాడుతూ వారిని తీసుకురావడం నీ చేతుల్లోనే ఉంది రిషి అనడంతో వెంటనే రిషి కావాలనే నాకు కనిపించకుండా దాక్కుంటున్నారు పెదనాన్న అలాంటిది ఎలా తీసుకొని రావాలో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ గా మాట్లాడతాడు రిషి.

Advertisement
Exit mobile version