Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Republic Amla Plant : ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఇన్విటేషన్ కార్డు.. నాటితే మొక్క పుట్టుకొస్తుంది… ఇదిగో..!

Republic Amla Plant

Republic Amla Plant

Republic Amla Plant : 2022 రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ ఆహ్వాన పత్రిక ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్డ్ దిగువ భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడ ‘Sow this card to plant an Amla plant‘ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంటుంది. అంటే.. ఈ పేపర్ కార్డును నాటితే.. అందులో నుంచి మొక్క మొలుస్తుందనమాట.. ఈ ఇన్విటేషన్ కార్డును సీడ్ పేపర్‌తో తయారు చేశారు.

ఆ పేపర్ కార్డు కిందిభాగంలో ఈ కార్డును నాటండి.. ఇదొక ఉసిరి చెట్టు అని రాసి ఉంది. కాగితం తయారీలో ఎరువులు కూడా వినియోగించారట.. కార్డుపై ప్రింట్ చేసిన ఈ సీడ్ పేపర్ ను ప్లాంటబుల్ పేపర్ అని కూడా అంటారు. పర్యావరణానికి హాని తలపెట్టకూడదనే ఉద్దేశంతో మట్టిలో వెంటనే కలిసిపోయేలా ఈ ప్లాంటెడ్ పేపర్ తయారుచేశారు.

73వ గణతంత్ర రిపబ్లిక్ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి కోవింద్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, శకటాలతో సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Read Also : Vastu Tips : ఆఫీస్‌లో ఆర్దిక లావాదేవీలు మంచిగా జరగడం లేదా… అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే !

Exit mobile version