Redmi Note 11pro+: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ కి ఎంతో డిమాండ్ వుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వినియోగదారులకు సరికొత్త అధునాతనమైన ఫీచర్ ద్వారా ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలోకి మరికొన్ని రోజులలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా రెడ్‌మీ మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. Redmi Note 11 Pro+ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. మార్చి 10వ తేదీన మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది మరి ఈ ఫోన్ ధర ఎంత ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమిటి అనే విషయానికి వస్తే….
5జీ నెట్వర్క్ కోసం ఈ ఫోన్లో అధునాతనమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఎన్నో అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 20 వేల రూపాయలతో ఈ ఫోన్ ధరలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 10వ తేదీ మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్స్ త్వరలోనే ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా అందుబాటులోకి రానుంది.