G
Telugu News » Latest » power cuttings in andhrapradesh
Latest

Power cuttings: ఏపీలో కరెంటు కోతలు.. అల్లాడుతున్న జనం

ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. ఎండకాలంలో కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ క

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. ఎండకాలంలో కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ కరెంటు కోతలు తప్పడం లేదు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి.

ఒక వైపు వేడితో తట్టుకోలేక ఫ్యాన్ వేసుకోవాలని చూస్తే.. కరెంటు లేక చాలా ఇళ్లల్లో నరకం చూస్తున్న వైనం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు పవర్ కట్ తో అల్లాడుతున్నాయి. విశాఖ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సాయంత్రం పూట రెండు గంటలు కరెంటు తీస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే కరెంటు టారిఫ్ లు పెంచేసి విద్యుత్ వాడాలంటే వణికే పరిస్థితి తీసుకువచ్చింది.

పవర్ హాలీడేలు ప్రకటించడంపై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనాన్ని పట్టి పీడిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

🏷ap power newspower cuttingspower cuttings in appower holiday in ap
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు