Pulse Polio Vaccination : దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం (Polio immunisation drive) ప్రారంభమైంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పల్స్ పోలియో నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నవజాత శిశువులకు, ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం (ఫిబ్రవరి 27) నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం (Polio vaccine Vaccination) జరగనుంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ప్రజాప్రతినిధులు పల్స్ పోలియో డ్రైవ్‌పై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిరోధక టీకాలపై బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు.
ఆ తర్వాత, ఆరోగ్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి నవజాత శిశువులు మరియు పిల్లలకు వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, విద్య, పంచాయత్ రాజ్, పురపాలక శాఖల సిబ్బంది కూడా ఈ డ్రైవ్‌లో పాల్గొంటారు. ఆదివారం ఉదయం ధర్నా చౌక్, ఇందిరాపార్క్ దగ్గర ఆరోగ్య మంత్రి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సీనియర్ హెల్త్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు.
తెలంగాణ వ్యాప్తంగా 38, 31,907 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. 23,331 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు మొత్తం 50.14 లక్షల పల్స్ పోలియో డోసులను పంపారు. బిక్షాటన చేసేవారు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికివాడల్లో ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా పోలియో డ్రాప్స్ అందించనున్నారు.
Read Also : Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ షురూ… పాత కొత్త కంటెస్ట్స్‌తో రచ్చ

