Viral Video: పెళ్లి అంటేనే బంధుమిత్రులతో, స్నేహితులతో ఇల్లంతా ఎంతో సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి లో బంధువులు, స్నేహితులు డాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. వాటిని విడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి బాగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెళ్లి లో ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ చేసిన ఒక చిలిపి పని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.
ఫోటోలు తీయటానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఇలా డబ్బు దొంగలించటం చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నరు. అయితే ఈ వీడియోలో ఉన్న ఫోటోగ్రాఫర్ సరదా కోసమే ఈ పని చేసినట్లు ఆ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ని ” ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం ఎప్పుడైనా చూశారా” అనే ట్యాగ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫోటోగ్రాఫర్ డబ్బూ దొంగలిస్తున్న సమయంలో పెళ్లికూతురు చూసి ఇచ్చిన రియాక్షన్స్ అదిరిపోయాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
