Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Cash daily limit : క్యాష్ ట్రాన్సాక్షన్స్ కు డైలీ లిమిట్.. ఎంతో తెలుసా?

Cash daily limit : చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద వాళ్ల వరకూ అంత డిజిటల్ లావాదేవీలే జరుపుతున్నారు. అయినప్పటికీ నగదు ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. నగదుతో కూడిన లావాదేవీలు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం కొన్ని పరిమితులను విధించింది. వీటిని మీరితే ఫైన్ కూడా పడుతుందని హెచ్చరించింది. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలులుకుందాం.

Cash daily limit

భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2 లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్‌ 269ఎస్‌టీ కింద ఒక రోజులో రూ.2లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర్నుంచి రూ.2లక్షలకు మించి నగదు బహుమతి అందుకోరాదు. అంతకు మించి తీసుకుంటే… నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. నగదుగా చెల్లిస్తే సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు కోల్పోతారు. వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నప్పుడు ఆ మొత్తం రూ.20వేలకు మించితే ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీ నిర్వహించాలి.

Read Also : Horoscope: నేడు ఈ మూడు రాశుల వాళ్లు ఏం చేసినా గెలుపే..!

Advertisement
Exit mobile version