Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ.. షాకింగ్ ట్విస్ట్.. అరవింద భర్తగా ఎంట్రీ ఇచ్చిన మురళి.. పద్మావతికి మురళినే అరవింద భర్తని తెలుస్తుందా?

Nuvvu Nenu Prema serial July 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిన్న ఎపిసోడ్ భాగంగా అరవింద భర్త కోసం గుడిలో ఎదురుచూస్తూ ఉంటుంది. అరవింద్ కోపంతో దేవుడి దగ్గరికి వెళ్లి నాలో లోపం ఉన్నట్లు నా పూజ లో కూడా లోపం ఉంటే నన్ను శిక్షించండి. అంతేకానీ మా ఆయన నా దగ్గరికి చేర్చండి అంటూ బాధపడుతుంది. నేను మా ఆయన్ని చూడాలి చూసి తీరాలి అంటూ అరచేతిలో హారతి బిళ్ళను వెలిగించుకొని దేవునికి హారతి ఇస్తూ ప్రాధేయ పడుతోంది. అప్పుడు అక్క అక్క వద్దు అంటూ ఉంటాడు. నన్ను ఎవ్వరూ ఆపకండి అరవింద అంటుంది. దేవుడిని మీరు నిజంగా ఆదిదంపతుల అయితే మీరే నన్ను నా భర్తను కలిసి ఉండేలా నా కోరికను నెరవేర్చండి అంటూ శివపార్వతులను వేడుకుంటుంది. అప్పుడు అరవింద భర్త రీ ఎంట్రీ ఇస్తాడు. ఎన్ని రోజులు కనిపించని అరవింద భర్త అతడు మురళి అనే నిజాన్ని ప్రేక్షకులకు తెలియదు అవుతుంది.

Murali turns out to be Aravinda’s husband

అక్క ఎవరొచ్చారో చూడు పూజలు ఫలించాయి అంటూ విక్కీ ఆర్య అంటారు అప్పుడు సంతోషంతో అరవింద దేవుళ్లకు నమస్కారం చేసి నాకు తెలుసు అండి మీరు వస్తారని అరవింద మురళి ని పట్టుకొని ఏడుస్తుంది నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను అంటూ అందుకే నిన్ను చూడాలని వెంటనే వచ్చాను ఇన్ని రోజుల నుంచి వస్తానని రాకుండా ఉన్నందుకు నన్ను క్షమించు. అంటాడు మురళి మీరు ఎప్పుడూ అలా మాట్లాడకండి. మీకు నా ఎ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మరి ఎందుకు ఏడుస్తున్నావ్. నీ నవ్వు నీ లాగే కన్నీళ్లు కూడా చాలా విలువైనవి ఊరుకో నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అంటాడు.

అప్పుడు విక్కీ బావగారు మీరు వస్తే తప్ప అక్క ఏం తినను అంటుంది.. కాస్త మీరైనా చెప్పండి. మురళి చెప్పడం ఎందుకు నేనే తినిపిస్తాను అంటాడు. అప్పుడు కుంచల మురళి మీరు కొంచెం రావడం లేట్ అయి ఉంటే .. అరవింద ఆ దేవుణ్ణి కిందకి దించేసేది. ఇప్పుడు హ్యాపీ నా అరవింద అంటుంది. అప్పుడు మురళి నేను వచ్చేసాను కదా అత్తయ్య ఇక అంతా హ్యాపీ నే రాణి గారు పదండి ప్రసాదం తిందురు కానీ అరవిందను తీసుకుని వెళ్తాడు. ఇకపోతే అను, పద్మావతితో మనం త్వరగా పోదాం అమ్మి ఇంట్లో అత్త ఒక్కతే ఉంది లేదంటే టెన్షన్ పడుతుంది నా ఫోన్లో సిగ్నల్ లేదు నువ్వు ఒకసారి అత్తకి ఫోన్ చేసి దారిలోనే ఉన్నామని చెప్పు అంటుంది.

Advertisement

వెంటనే పద్మావతి అక్క నా ఫోన్ అక్కడే మర్చిపోయి వచ్చాను.. నువ్వు ఉండు నేను తీసుకొని వస్తాను. అప్పుడు విక్కీ బావగారు మీరు ఎంత బిజీగా ఉన్నా అక్క కోసం కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి.. అక్క బాధపడుతుంటే నేను చూడలేను అంటాడు. వెంటనే ఆర్య కూడా అవును బావ గారు మత కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేను అంటాడు. అప్పుడు మురళి బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి నీకు వార్నింగ్ ఇస్తున్నారా ఏంటి..అంటాడు. వెంటనే విక్కీ అదేం లేదు బావగారు మా అక్క సంతోషం కోసం అలా చెప్తున్నావ్ అంటాడు. మురళి నాకెందుకు ఉంటుందని బాధపెట్టాలని అంటాడు. వెంటనే విక్కీ అలా కాదు బావగారు మీరు తనతోనే ఉండి సంతోషంగా ఉండాలని మా అక్క ఆనందం కంటే మాకు ఏది ముఖ్యం కాదు ప్లీజ్ బావ గారు అంటాడు. వెంటనే మురళి సరే ఇక్కడే ఉంటాను అంటారు.

అప్పుడు అరవింద మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను అండి అంటుంది. వెంటనే మురళి పార్వతీ పరమేశ్వర లాగా మనం ఎప్పుడు కలిసి ఉందాం.. ఇంక నిన్నుఎప్పుడు బాధ పెట్టే పని నేనేం చేయను అరవింద అంటాడు. అప్పుడు అరవింద్ అసలు నాకు పెళ్లి కాదనుకుంటే అలాంటిది మీరు మాకు ఈ దాంపత్య ప్రసాదాన్ని అందించారు. మీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు ఉన్నానండి అంటుంది. అప్పుడు మురళి అందుకే నువ్వంటే నాకిష్టం జన్మ జన్మల కి నువ్వే నా భార్య రావాలని కోరుకుంటాను రాణమ్మ అంటాడు. వెంటనే అరవింద ఏ కష్టం రాకూడదని ఏదైనా వస్తే అది నాకే రావాలి ఎందుకంటే మీరు అంటే నాకు ఇష్టం అంటుంది.

Murali turns out to be Aravinda’s husband

వెంటనే మురళి ఆ మాటకొస్తే మీరంటే కూడా నాకు ప్రాణం రాణమ్మ అందుకే నీకోసం వచ్చేసాను అంటాడు. అప్పుడు అరవింద మీకు నా ప్రేమతో పాటు దేవుడు అండ కూడా ఉండాలని నీకు రక్ష కడుతున్నా అండి అని కాళ్ళు పట్టుకో పోతుంది . వెంటనే మురళి నా ప్రాణం అక్కడ కాదు ఇక్కడ రాణమ్మ హత్తుకుంటాడు. పద్మావతి గుళ్ళోకి వచ్చి విక్కీ ని నాకు దారి ఇవ్వండి నా ఫోన్ గుళ్లో మర్చిపోయి వచ్చాను అంటుంది. వెంటనే ఇదిగో నీ ఫోన్ అంటాడు. అప్పుడు పద్మావతి నువ్వే నా ఫోన్ దాచి పెట్టావా అంటుంది. వెంటనే విక్కీ నీ ఫోన్ దాచిపెట్టి అంత కర్మ నాకు పట్టలేదు అయినా గుళ్లో మర్చిపోయావు. నేను ఇంకా జాగ్రత్తగా దాచి పెట్టాను అయినా మనుషుల్ని పారేసుకున్న అంత ఈజీగా వస్తున్న పారేసుకోకు పద్మావతి తో అంటాడు.

Advertisement

Nuvvu Nenu Prema Serial July 22 Today Episode : అరవింద భర్త వచ్చాడని తెలిసి పద్మావతిలో ఆనందం.. చూసేందుకు వెళ్తుండగా అను ఫోన్..!

Murali turns out to be Aravinda’s husband

అప్పుడు పద్మావతి నాకు జాగ్రత్త గా ఉంచుకోవడం తెలుసు అంటుంది. అప్పుడు పద్మావతి అన్నగారి భర్త వచ్చారు అనుకుంటా కదా అందుకే అరవింద్ గారు మొఖం సంతోషంతో వెలిగిపోతుంది.. అయినా అరవింద మేడం లాంటి మంచి వాళ్ళకి మంచి భర్త వచ్చి ఉంటాడు అందులో సందేహమే లేదు అంటుంది. వెంటనే విక్కీ ఇక్కడ మాట్లాడే బదులు లోపలికెళ్లి మా అక్క తో మాట్లాడొచ్చు కదా అక్క సంతోషంగా ఫీల్ అవుతుంది అంటాడు. అప్పుడు అను పద్మావతి కాల్ చేసి అమ్మి అత్త ఒకటే ఉండాలి తిడుతుంది అత్త ఇప్పుడే ఫోన్ చేసింది అంటుంది. వెంటనే పద్మావతి సరే నేను వెళ్తున్నాను మా అత్త ఫోన్ చేసిందంట అంటుంది. విక్కీ మా అక్క ముఖంపై ఎప్పటికీ ఇలానే ఉండేలా చూసే బాధ్యత మీదే బావగారు అంటాడు. వెంటనే మురళి నా ప్రాణం పోయినా నీ చేతిని వదిలిపెట్టను అంటాడు.

అప్పుడు కుంచాల అరవింద అనే కాదు ఉదయం నుండి నేను కూడా ఏమి తినలేదు ఆకలేస్తుంది.. అరవింద కదా ఇంటికెళ్ళి తింటూ మాట్లాడుకుందాం అంటుంది. అప్పుడు పద్మావతి అత్త అంటూ అరుచుకుంటూ వస్తుంది అప్పుడు పద్మావతి వాళ్ళ అక్క ఎందుకే రాగానే చెవి కోసమే కదా అరుస్తున్నావు అంటుంది. వెంటనే పద్మావతి ఇది అరుపులు కాదు అత్తా ఆకలి కేకలు అంటుంది.. నా కోసం వంటలన్నీ చేశావా అంటుంది. పద్మావతి వాళ్ళ అత్త నువ్వు రాగానే లారీ ఇస్తా అని నాకు తెలుసు అందుకే అన్నీ చేశాను అంటుంది. వెంటనే పద్మావతి నా అత్త బంగారం అంటుంది.

Murali turns out to be Aravinda’s husband

పద్మావతి వాళ్ళ అత్త అలా గిల్లకే నొప్పి లేస్తుంది వదులు అంటుంది. అప్పుడు మురళి నమస్కారం బామ్మగారు అంటాడు. వెంటనే విక్కీ వాళ్ళ నానమ్మ నువ్వు ఇంత మంచి మంచిగా అడుగు బాబు అంటుంది. అరవింద తో అరవింద నీ పూజలు వ్రతాలు ఎక్కడికి పోలే అందుకే నీకు ఇంత మంచి భర్త వచ్చాడు అంటుంది. ఈ సంతోషం ఎప్పుడూ ఉండాలంటే మనవరాలునో మనవడునో ఇవ్వండి అంటుంది. అప్పుడు కుంచాల అరవింద బామ్మగారు సిగ్గుపడని చెప్పలే మనవడిని ఇవ్వ మంటుంది మురళి ఇక నువ్వు ఇక్కడే ఉండి బామ్మ గారి డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయాలి అంటుంది. అప్పుడు మురళి పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. వెంటనే విక్కీ ఏంటి బావగారు మళ్లీ వర్క్ గురించి ఆలోచిస్తున్నారా అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్ – పద్మావతిని అవమానించిన కుంచల.. భర్త కోసం ఎదురుచూస్తూ అరవింద ఎమోషనల్..!

Exit mobile version