Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

NEET Exam 2022 : నీట్ పరీక్ష తేదీ కూడా వచ్చేసిందండోయ్… ఎప్పుడో తెలుసా?

NEET Exam 2022 : ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను జులై 17వ తేదీన జరగనుంది. జులై 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి మే 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు.. వివిధ దేశాల్లోని 14 పట్టణాల్లో నీట్ నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.

neet exam 2022 date released

ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది నుంచి నీట్ పరీక్షకు గరిష్ఠ వయో పరిమితి ఎత్తి వేశారు. భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టుకు 50 చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున 200 నిమిషాలు పరీక్ష సమయం గా ఎన్టీఏ నిర్ణయించింది. ప్రతీ ఏటా దేశ వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎంత మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతున్నారో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

Read Also : Vishnu Priya: ఏ మాత్రం తగ్గని విష్ణు ప్రియ.. నలుపు చీరలో నాభి అందాలను చూపిస్తూ మతులు పోగొడుతుందిగా?

Exit mobile version