Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam January 09 Today Episode : చారుశీలకు వార్నింగ్ ఇచ్చిన మోనిత.. సౌందర్య ఇంటికి వెళ్లిన దీప?

Karthika Deepam january 09 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చారుశీల,మోనిత ఇద్దరు కలిసి మరొక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో దీప ఒకచోట కూర్చొని బాధపడుతూ మోనిత అన్నమాటలు తలుచుకొని ఎలా ఆ మోనిత పీడ విరగడ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

మరొకవైపు కార్తీక్ గదిలో ఎలా అయినా చేసి ఆ మోనితను ఈ ఇంటికి రాకుండా చేయాలి దీపకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దీప మోనిత గురించి ఆలోచిస్తూ ఒక్కసారిగా గట్టిగా డాక్టర్ బాబు అని పిలవడంతో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏమైంది దీప మోనిత నాకు భయంగా ఉంది డాక్టర్ బాబు అనగా ఆ మౌనిక అన్న మాటలు గురించి ఆలోచించొద్దు అని చెప్పాను కదా దీప అనడంతో ఎలా ఆలోచించకుండా ఉంటారు డాక్టర్ బాబు ఆ మోనిత ఎంతకైనా తెలుస్తుంది ఏమైనా చేస్తుంది.

Karthika Deepam january 09 Today Episode

నేను చనిపోతానని తెలిసినప్పుడు భయపడలేదు మీరు నాకు దూరంగా ఉన్నప్పుడు భయపడలేదు కానీ ఇప్పుడు ఆ మోనిత గురించి ఆలోచిస్తుంటే భయమేస్తోంది అని అంటుంది దీప. నేను చనిపోయిన తర్వాత మౌనిత మిమ్మల్ని బెదిరించి ఎక్కడ స్విట్జర్లాండ్ కి తీసుకెళ్తుందేమో అని భయంగా ఉంది అనడంతో నీకు ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పాను దీప ఆ మాట మాట్లాడకు అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప ఏమో డాక్టర్ బాబు నాకు నిజంగా చాలా భయంగా ఉంది. కూడా చనిపోవడం ఏమైనా సరదానా నాకు మీతో కలిసి నూరేళ్లు కాదు వెయ్యి ఏళ్ళు జీవించాలని ఉంది అంటూ కార్తీక్ చేయి పట్టుకుని నన్ను బ్రతికించండి డాక్టర్ బాబు అని ఏడుస్తూ మాట్లాడుతుంది దీప.

Advertisement

అప్పుడు కార్తీక్ దీపను దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత సౌందర్య నిద్రలేచి దేవుడిని ఈ రోజైనా కనీసం నా కొడుకు కూడా కనిపించేలా చెయ్యి స్వామి అని బయటకు వెళ్లగా అక్కడ దీప ఉండడంతో సంతోషంతో ఎమోషనల్ అవుతుంది సౌందర్య. అప్పుడు దీపగట్టిగా హత్తుకొని నువ్వు నిజంగానే వచ్చావా దీప అనడంతో అవును అత్తయ్య అని అంటుంది. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని అనుకోలేదు దీప అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది సౌందర్య. సరే కార్తీక్ ఎందుకు రాలేదు అనడంతో ఆయనకు తెలియకుండా వచ్చాను అత్తయ్య అని అంటుంది. అరవడంతో గట్టిగా మాట్లాడకండి అత్తయ్య పిల్లలు లేస్తారు అని అంటుంది.

అంటే పిల్లలకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా దీప అనడంతో అవును అత్తయ్య అని అంటుంది. అప్పుడు సౌందర్య నీ పిల్లలు నీకోసం రోడ్డుమీద పిచ్చోళ్ళ లాగా వెతుకుతున్నారు అనడంతో తెలుసు అత్తయ్య అని అంటుంది. అంటే మేము ఇక్కడికి వచ్చిన విషయం తెలిసి ఇన్ని రోజులు మమ్మల్ని చూస్తూనే మా ముందుకు మీరు రాలేదా అనడంతో అవును అంటుంది దీప. ఇలా చేస్తున్నావు అంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుంది చెప్పు దీప అసలు ఏం జరిగింది. నిజం చెప్పు కార్తీక్ బాగానే ఉన్నాడా అని అడగగా ఆయన బాగానే ఉన్నారు అత్తయ్య ముందు నేను చెప్పేది నిదానంగా వినండి అని సౌందర్యను పక్కకు పిలుచుకొని వెళ్తుంది.

మరొకవైపు మోనిత మొబైల్ ఫోన్లో కార్తీక్ ఫోటోలు చూస్తూ ఉండగా ఇంతలో చారుశీల కాఫీ తీసుకొని వచ్చి ఏంటి మొబైల్ తెగ చూసేస్తున్నావు అని అడగగా కార్తీక్ ఫోటోలు చూస్తున్నాను అంటుంది మోనిత. అప్పుడు చూడు నా కార్తిక్ ఎంత బాగున్నాడు అని చారుశీలకు చూపించడంతో ఇది జైల్లో ఉంటే కార్తీక్ ని దక్కించుకుందాం అనుకున్నాను ఇది మళ్ళీ తిరిగి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు మోనిత ఏంటి చారుశీల నాకు పోటీగా వద్దామనుకుంటున్నావా అనడంతో చారుశీల షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ నాకు అలాంటి ఆలోచనలు లేవు అనడంతో నాటకాలు వాడొద్దు చారుశీల నేను కార్తీక్ ని ఇంతలా ప్రేమిస్తున్నా కూడా ఎప్పుడూ నా దగ్గర ఇన్ని ఫోటోలు లేవు ఇది నా మొబైల్ కాదు నీ మొబైల్ నీ ఫోటోలు నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అనడంతో చారుశీల టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

అదేం లేదు మోనిత అనగా ఎక్కువ చేసావంటే ఆల్రెడీ చంపి జైలుకి వెళ్ళాను నేను చంపడం పెద్ద సంగతి కాదు అని వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు హిమ,సౌర్య రోడ్డుమీద కార్తీక్,దీపల కోసం వెతుకుతూ ఉంటారు. అదే రూట్ లో కార్తీక్ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు దీప కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సౌర్య హిమ చల్ కొనుక్కోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక దొంగ వచ్చి హిమ చేతిలో ఉన్న డబ్బులు లాక్కొని వాళ్లను నెట్టేస్తాడు. అప్పుడు హిమ సౌర్య కింద పడిపోతూ ఉండగా కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ ని చూసి హిమ, సౌర్య షాక్ అవుతారు. ఆ తర్వాత కార్తీక్ నీ నేను గట్టిగా హత్తుకొని ఆనంద పడుతూ ఉంటారు.

Read Also : Karthika Deepam january 07 Today Episode : చారుశీలను అసహ్యించుకుంటున్న.. సరికొత్త ప్లాన్ వేసిన చారుశీల, మోనిత?

Advertisement
Exit mobile version