Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

janaki kalaganaledu Oct 14 Today Episode : జానకి విషయంలో మళ్ళీ ఫెయిల్ అయిన మల్లిక ప్లాన్.. ఆనందంలో జ్ఞానాంబ..?

 janaki kalaganaledu Oct 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర,జానకి, అఖిల్ విషయం గురించి జ్ఞానాంబతో మాట్లాడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర అమ్మ నువ్వు అఖిల్ నీ ప్రేమగా పెంచావు. తప్పు చేశాడు అన్న కోపంతో ఇలా దూరం పెట్టావు అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు ఇంకా దూరం పెడితే వాడు ఇంకా ఇలా ఎన్ని పనులు చేస్తానో అని భయమేస్తుంది అమ్మ అని అనడంతో, వెంటనే జ్ఞానాంబ అఖిల్ ని క్షమించడం అంత తొందరగా జరగదు కానీ మీరు ఎన్నిసార్లు చెబుతున్నారు కాబట్టి ఆలోచిస్తాను అని అంటుంది. ఆ తర్వాత జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర పడుకుంటాడు.

janaki kalaganaledu Oct 14 Today Episode

మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి జానకి అలాగే చదువుతూ నిద్రపోయి ఉంటుంది. ఇప్పుడు రామచంద్ర జానకి డిస్టబ్ చేయకుండా పంట గదిలోకి వెళ్లి జానకి కోసం కాఫీ ని తీసుకుని వస్తాడు. అప్పుడే మల్లికా నిద్ర లేచి బయటకు వచ్చి ఏంటి బావగారు ఈ సమయానికి కాఫీ తీసుకొని వెళుతున్నారు అంటూ రామచంద్ర ని ఫాలో అవుతుంది. అప్పుడు రామచంద్ర జానకి నేను మెల్లగా నిద్ర లేపి కాఫీ ఇవ్వడంతో అయ్యో మీరేంటి ఇలా అని అనగా అప్పుడు రామచంద్ర మీకోసం కాఫీ మాత్రమే కాదు ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనటంతో ఆ మాటలు విన్నా మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటంతో మల్లిక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా అయినా వారి బంధాన్ని చెడగొట్టాలి అనుకుంటుంది. ఇక ఆ తరువాత ఎలా అయినా జానకి చదువుకోకుండా చెడగొట్టాలి అని బయట కూర్చుని ఆలోచిస్తూ ఇంతలో తులసి కోటను చూసి అక్కడికి వెళ్లి అమ్మ తులసమ్మ నన్ను తిట్టుకోవద్దు నన్ను క్షమించు అంటూ తులసి చెట్టు పీకేసి ఇష్టం వచ్చిన విధంగా మన్నును పారేస్తూ ఉంటుంది.

Janaki Kalaganaledu అక్టోబర్ 14  ఎపిసోడ్ : తులసి కోటను మల్లిక కూలగొడితే..నేను చేశాను జ్ఞానాంబకు చెప్పిన జానకి..

అదంతా రామచంద్ర జానకి ఇద్దరు కిటికీలో చూసి ఆ షాక్ అవుతారు. ఆ తర్వాత అక్కడికి జ్ఞానాంబ రావడం చూసి వెళ్ళిపోతుంది మల్లిక. ఇంతలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ ఇంట్లో అందరినీ పిలిచి ఏం జరిగింది ఎవరు ఇలా చేశారు అని అడుగుతుంది. అప్పుడు మల్లికా అక్కడికి ఏం జరిగింది అంటూ అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. దాంతో మల్లిక వైపు రామచంద్ర అలాగే చూస్తూ ఉంటాడు.

అప్పుడు మల్లికా ఆ తప్పు జానకి చేసింది అంటూ జానకి మీదకు నింద వేస్తుంది. ఆ తర్వాత జానకి ఎలాంటి తప్పు చేయొద్దు ఒకవేళ అలా చేస్తే నా దగ్గర క్షమాపణలు కోరుతుంది అని జ్ఞానాంబ చెప్పడంతో వెంటనే మల్లికా ఆ తప్పు ను జెస్సీ మీదకు నూకాలి అని చూస్తుంది. అప్పుడు జెస్సి మీద చెప్పడంతో అత్తయ్య గారు నాకేం తెలియదు నేనేం చేయలేదు అని అంటూ ఉండగా వెంటనే జానకి నేను చేశాను అత్తయ్య గారు అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

అప్పుడు చూసుకోవాలి కదా జానకి అని జ్ఞానాంబ అనడంతో మల్లిక షాక్ అవుతుంది. ఏదో జరుగుతుంది అంటే ఇంకేదో జరిగింది అనుకొని మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి ఆ తులసి చెట్టును నాటే ప్రయత్నం చేస్తూ ఉండగా జ్ఞానాంబ గోవిందరాజు పెళ్లినాటి ఉంగరం దొరుకుతుంది. అది చూసి వారు సంతోషపడుతూ ఉంటారు. మల్లిక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కుళ్ళుకుంటూ వుంటుంది.

Read Also : Janaki Kalaganaledu serial Oct 12 Today Episode : అఖిల్ చెంప చెల్లుమనిపించిన జ్ఞానాంబ.. జానకి నానా మాటలు అన్న అఖిల్..?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version