Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Malli Nindu Jabili serial Oct 3 Episode : అరవింద్‌తో పెళ్లిబంధంపై మల్లి ఎమోషన్.. మాలినితో ఏకాంతంగా అరవింద్..!

Malli Nindu Jabili serial Oct 3 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. వెంటనే మల్లి అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు మల్లి బాబుగారూ కొంచెం నన్ను వదిలిపెడతారా అని అంటుంది. మీరు కొంచెం నాకు దగ్గరగా వస్తేనే ఊపిరాడదు.. అలాంటిది ఇంత దగ్గరగా ఉంటే నా మనస్సు అంత ప్రేమను తట్టుకోలేదని మల్లి అంటుంది. వెంటనే మల్లిని అరవింద్ వదిలిపెడతాడు. దాంతో ఏడ్చుకుంటూ మల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మల్లి.

Malli Nindu Jabili serial Oct 3 Episode

బాబూగారూ అలా హత్తుకున్నప్పుడు ఎందుకిలా ఉండిపోయానంటూ మనసులో అనుకుంటుంది. భార్యభర్తల మధ్య అనుబంధం, ప్రేమంటే ఇదేనమోనని మల్లి అనుకుంటుంది. ఆ బంధం లో ఉండే గొప్పతనం.. దొరబాబు భార్య మాలిని అక్క మరి నువ్వు ఏమి అవుతావు. నీకు దొరబాబు కి ఎలాంటి అనుబంధం లేదా.. స్నేహబంధం.అని నువ్వు నిన్ను మోసం చేసుకోకు.. అదే నిజం అయితే నీ మెడలో ఉన్న తాళి సంగతేమిటి ? పెళ్లి జరిగింది కదా..ఆ రోజు బలవంతంగా జరిగింది. మాలిని, అరవిందు భార్య భర్తల బంధం అంటున్నాను మల్లి తనకు తాను చెప్పుకుంటుంది.

నీకు ఎలాంటి ప్రేమ లేకపోతే అరవిందుని ఎందుకు ఆరాధిస్తున్నాం.. నీ మనసులో తన భర్త అనే భావన లేకపోతే రెండోసారి తాళి కడుతున్నప్పుడు సంతోషంగా ఉన్నావు. అరవింద్ కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. సమాధానం చెప్పు.. ఈరోజు నీ మనసాక్షి వినాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు. నువ్వు సమాధానం చెప్పలేవు అరవిందుని ప్రాణంగా ప్రేమిస్తు ఉన్నావు కాబట్టి కి భార్యాభర్తల బంధానికి కట్టుబడి ఉన్నావ్. నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం కూడా నీ భర్త అరవింద్ ఆడుకోవడం కోసమే. నీ మనసులో ప్రతి ఆలోచనలో అరవింద్.

Advertisement

మల్లి  సీరియల్ అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ : అయోమంలో మల్లి.. ఈ జన్మకు నేను రాధనే.. మాలినినే అరవింద్ బాబుకు అన్నీ..

లేదు లేదు నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నా. నన్ను నా ఆలోచన మార్చాలని చూడకు ఈ జన్మకు నేను రాదని ఆయన కృష్ణుడు మేము భార్య భర్తలు గా ఉండడం కుదరని పని. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టావు.  మల్లి రాధా అంటే స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు.. రాధలా ఆరాధిస్తున్న ప్రేమిస్తున్నా. నీది అంత గొప్ప మైన ప్రేమ కాకపోతే రాధకు నీకు చాలా తేడా ఉంది. రాధా ప్రేమించి పెళ్లి చేసుకోలేక పోయింది. కానీ నీ జీవితంలో పెళ్లి అయిన తర్వాతే ప్రేమ మొదలైంది.

అరవింద్ కూడా ఏదో ఒక రోజు నీ మీద ప్రేమ కలుగుతుంది. అలా జరగదు అరవింద్ గుండెల్లో స్థానం మాలిని అక్క కు మాత్రమే.. కాలం మనసును మారుస్తుంది మనుషుల్ని కలుపుతుంది. జరగని వాటి గురించి నేను ఆలోచించను దయచేసి ఇక నుంచి వెళ్ళిపో అంటూ తన అంతరాత్మ పై కోపడుతుంది. అరవింద్, మాలిని మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. మరోవైపు అరవింద్ కవిత్వం మాలిని గుర్తు చేసుకుంటూ సంతోష్ పడుతుంది.

Malli Nindu Jabili serial Oct 3 Episode 

అరవింద్ వచ్చి ఆ రోజు అనుకోకుండా జరిగింది సారీ అని చెప్తాడు. మాలిని నీ గురించి తెలిసి కూడా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఏమి జరిగిందంటే అవార్డుని బ్యాగు పోయింది. మల్లి ఆ దొంగను పట్టుకొని అవార్డు బ్యాగ్ ను కాపాడి. నేను ఇంటికి రాగానే నాకు ఇచ్చింది. మాలిని, మల్లి చెప్తున్నది నేను వినలేదు అనుకుంటుంది. అరవిందుతో అనవసరంగా మల్లి పై కోపం పడ్డాను. ఎప్పుడూ ఇలా చెయ్యను అరవిందుతో అంటుంది. మాలిని, అరవిందు కలసి సరదాగా ఉంటారు. మాలినితో ఏకాంతంగా అరవింద్..

Advertisement

చిన్న రొమాంటిక్ సాంగ్ వస్తుంది. అనుపమ, కుటుంబ సభ్యులంతా పిలిచి ఈ రోజు బతుకమ్మ పండగ అందరూ మర్చిపోయారు.. మల్లిని ఊర్లో బతుకమ్మ పండుగ ఆడతారా అంటుంది. బతుకమ్మ నేను స్వయంగా తయారు చేసి ఆడేది అని చెప్తుంది. బతుకమ్మ తొమ్మిది రోజుల గురించి చాలా వివరంగా అందరి తెలిసేలా చెప్తుంది. అనుపమకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టమైన చెప్పుకుంటారు. ఈసారి సంక్రాంతికి మళ్లీ తల్లి వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటారు.

అరవిందు, మల్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆందోళన పడతారు. బందర్, మల్లి పూలు తీసుకురావడానికి వెళ్తారు. అనుపమ, మల్లి ఏ ఇంటి కోడలు అవుతుందో అక్కడ వాళ్లంతా ఆనందంగా ఉంటారు. రూప మల్లిని చేసుకోబోయే అతడు చాలా అదృష్టవంతుడు. బాల మాటలను విన్న అరవిందు, మల్లితో జరిగిన పెళ్లి గుర్తు చేసుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో బతుకమ్మ సంబరాలతో సందడిగా మారిపోతుంది. మల్లితో పాటు అందరూ బతకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకుంటారు.

Read Also : Malli Nindu Jabili serial Oct 1 today Episode : మాలిని, అరవింద్‌లను కలిపిన మల్లి.. మల్లిని హత్తుకుని ఎమోషనల్ అయిన అరవింద్..!

Advertisement
Exit mobile version