Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu: దేవయాని ప్లాన్ బెడిసికొట్టేలా చేసిన మహేంద్ర..షాక్ లో రిషి.?

Guppedantha Manasu March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

mahendra-made-devyani-plan-reveres-rishi-in-shock

వసుధార సూచన అనే కాన్సెప్ట్ గురించి, షార్ట్ ఫిలిం గురించి చెబుతూ ఉంటుంది. అదేవిధంగా చదువుకోవడం వల్ల కలిగే లాభం గురించి, చదువు యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ ఉంటుంది. ఈ భూమిపై అన్నింటి కన్నా గొప్పది చదువు మాత్రమే అని చెబుతుంది వసుధార. వసుధార మాటలు విన్న అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా,మరొక వైపు గౌతమ్ మాత్రం రిషి ని తిట్టుకుంటూ ఉంటాడు. ఆ షార్ట్ ఫిలిం చూసిన మినిస్టర్ కాన్సెప్ట్ ఎవరిది అని అడగగా జగతి అని చెబుతారు.

దీనితో మినిస్టర్ జగతిపై కామెంట్ల వర్షం కురిపిస్తాడు. అప్పుడు మహేంద్ర తో పాటు రిషి కూడా జగతి కి షేకండ్ ఇచ్చి అభినందనలు తెలపడంతో జగతి సంతోషపడుతుంది. మరోవైపు రుషి గౌతమ్ దగ్గరకు వెళ్లి సారి అని చెప్పగా అప్పుడు గౌతమ్ నా కంటే నువ్వే బాగా చేసావ్ అంటూ హాగ్ చేసుకుంటాడు. మరొక వైపు దేవయాని జగతిని అవమానించే విధంగా ప్లాన్ చేసింది.

Advertisement

వసుధార గౌతమ్ ని షార్ట్ ఫిలిం లో మీరు కనిపించనందుకు బాధ పడుతున్నారు సార్ అని అడగగా లేదు అని అంటాడు గౌతమ్. కానీ ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటానులే అని సరదాగా అంటాడు గౌతమ్. మరొక వైపు దేవయాని అరెంజ్ చేసిన ఒక జర్నలిస్ట్ షార్ట్ ఫిలిం గురించి ప్రశ్నలు అడుగుతూ.. జగతిని అవమానించే విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇక పనింద్ర ఈ షార్ట్ ఫిలిం కి రూపకర్త జగతి అని చెప్పగా అందరూ చప్పట్లతో జగతికి అభినందనలు తెలుపుతారు.

Guppedantha Manasu March 1 Today Episode : గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్…  

మీరు కాలేజీకి రావడంతో ఈ కాలేజీ ప్రతిష్ట మరింత పెరిగింది కదా అని అడగగా.. అలా ఏమీ లేదు ఈ కాలేజీ గొప్ప విద్యాసంస్థ ఇందులో చేయడం నా అదృష్టం అని అంటుంది జగతి. ఆ జర్నలిస్ట్ మరింత మితి మీరుతూ ఈ విజయం వెనుక ఆ పురుషుడు లేడు అంట కదా, మీరు ఒంటరి అంట కదా మీ కుటుంబ వివరాలు ఎక్కడా చెప్పలేదు ఎందుకని అని ప్రశ్నించగా.. షార్ట్ ఫిలిం కు సంబంధించిన ప్రశ్నలు అడగండి నా లైఫ్ గురించి కాదు అని అంటుంది జగతి.

అయినప్పటికీ జర్నలిస్ట్ జగతిని ఆ అవమానించే విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు మీ వారిని వదిలేశారా లేక మిమ్మల్ని మీ వారు వదిలేస్తారా అని అనడంతో మహేంద్ర కోపడతాడు. ఇక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మహేంద్ర కాపాడతాడు. అప్పుడు జర్నలిస్ట్ సార్ మీకు తెలిసి ఉంటే చెప్పండి మా డ్యూటీ అంటాడు.

Advertisement

ఇక ఆ జర్నలిస్టు అడిగే ప్రశ్నలకు జగతి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు మహేంద్ర జగతిని వెనక్కి తీసుకొని వచ్చి జగతి నా భార్య,రిషి నా కొడుకు అని అందరి ముందు చెబుతాడు. దీంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.మరి రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి మరి..

Read Also : Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Advertisement
Exit mobile version