Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti gruhalakshmi: భర్తను ఆపేందుకు లాస్య కపట నాటకం.. విషం తాగి కన్నీరు!

Intinti gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కార్తీక దీపం సీరియల్ తర్వాత తెలుగు ప్రజలు ఎక్కువగా ఈ సీరియల్ నే చూస్తున్నారు. అందుకే టీఆర్పీ దూసుకుపోతోంది. ఈ మధ్య ఇంటింటి గృహలక్ష్మి టీఆర్పీ చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కాస్త పెరిగిపోతుంది. అయితే లాస్యని బెదిరించో, భయపెట్టో తన డబ్బులు తాను సాధించుకుంది తులసి. దీంతో దేవుడు ముందు నిలబడి.. నువ్వున్నావ్ తండ్రి అంటూ దండం పెట్టుకుంటుంది. ఇంతలో లాస్య ఫోన్ చేసి నందుకు నిం చెప్పి నా జీవితం ఎందకు నాశనం చేశావంటూ అరుస్తుంది.

తులసి నేను నీలా అలాంటి పని చేయను.. చెప్పింది నేను కాదంటుంది. ఆ తర్వాత సంజన ఫోన్ చసి.. ఏంటి లాస్య నేను నీకు డబ్బు ఇచ్చానని చెప్పావట నందుకు. నా భర్తకు తెలిస్తే ఎలా ఉంటుంది. ఎందుకు అబద్ధం చెప్పావంటూ అరుస్తుంది. ఏదో ఒకటి సర్ది చెప్పి… నందును ఇంటి నుంచి వెళ్లిపోకుండా ఎలా ఆపాలో ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే విషం తాగినట్టు నటించి… నందును ఎమషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కల్లబొల్లి మాటలు చెప్పి అతడిని అక్కడే ఉండేలా చేస్తుంది. మరి రేపు ఏం కానుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Advertisement
Exit mobile version