Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam serial Sep 13 Today Episode : దీప వాళ్ళ అన్న చొక్కా పట్టుకొని నిలదీసిన మోనిత..టెన్షన్ పడుతున్న వంటలక్క..?

Karthika Deepam serial September 13 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప ప్లాన్ సక్సెస్ అయినందుకు మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మోనిత, అసలు నువ్వు ఆ వంటలక్క దగ్గరికి ఎప్పుడు వెళ్లావు అని అడగగా అప్పుడు కార్తీక్ జరిగింది మొత్తం వివరిస్తాడు. దాంతో మోనిత అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు కార్తీక్ అది నిన్ను ఒంటరిగా కూర్చోమని చెప్పినప్పుడే నీకు అర్థం కాలేదా నిన్ను నన్ను విడగొట్టడానికి అది ప్రయత్నిస్తోంది అంటూ గట్టిగా అరుస్తుంది.

karthik fires on monitha in todays karthika deepam serial episode

దాంతో కోపం వచ్చినా కార్తీక్ ఎందుకు నువ్వు పదేపదే వంటలక్కని తిడతావు మోనిత, ఆమె నా పిల్లలు నా భార్య మంచిగా ఉండాలని కోరుకుంటుంది కదా అంటూ మోనిత మీద సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య కుటుంబం వినాయక చవితి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు పూజారి బుక్స్ తీసుకొని రమ్మని చెప్పగా హిమ,శౌర్య బ్యాగు తన బ్యాగు రెండు తీసుకుని వస్తుంది.

ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఎమోషనల్ అవుతూ నానమ్మ మనం వెళ్లి సౌర్యం తెచ్చుకుందాం అని అనగా అప్పుడు సౌందర్య అది రాను అంటుంది ఏం చేయాలి అని అంటుంది. మనం బలవంతంగా తీసుకువస్తే అది కనిపించకుండా ఎక్కడికైనా పారిపోతుంది అందుకే నేను దానిని ఏమీ అనడం లేదు అనడంతో హిమ అర్థం చేసుకుంటుంది. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్యతో కలిసి జరిగింది మొత్తం వివరిస్తూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam serial Sep 13 Today Episode : టెన్షన్ పడుతున్న వంటలక్క..?

అప్పుడు అతను ఆ మోనిత ను ఒకసారి చూపించమ్మా నాకు చూడాలని ఉంది అని సరే అని దీప అతన్ని పిలుచుకొని మోనిత ఇంటికి బయలుదేరుతుంది. మరొకవైపు మోనిత జరిగిన మొత్తం తలుచుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలాగే చూస్తూ ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. కార్తీక్ తప్పకుండా గతం గుర్తుకు వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ జ్వరం వచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది.

ఇంతలోనే కార్తీక్ రావడంతో జ్వరంగా ఉంది కార్తీక్ అంటూ డ్రామా ఆడుతుంది. మోనిత మాటలు నిజం అని నమ్మిన కార్తీక్ టెన్షన్ పడుతూ డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని బయటకు వెళ్తాడు. ఇంతలోనే దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్యను అక్కడికి పిలుచుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ ని పరిచయం చేసిన తరువాత ఏం జరిగింది డాక్టర్ బాబు అలాగా ఉన్నారు అని అనగా మోనిత జ్వరం వస్తుంది అని చెబుతాడు కార్తీక్. అప్పుడు దీపా వాళ్ళ అన్నయ్య మోనిత జ్వరం చెక్ చేయడానికి లోపలికి వెళ్తాడు.

మోనిత తన ప్లాన్ ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మోనిత ను చెక్ చేసిన తర్వాత అతను మోనిత కు మందులు రాసి ఇవ్వగా ఆ మందులు స్క్రిప్ట్ చూసిన మోనిత షాక్ అయ్యి అతన్ని చొక్కా పట్టుకొని నిలదీస్తుంది. ఎవర్రా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను ఆ వంటలక్క పంపించింది కదా అంటూ అతనిపై కోప్పడుతుంది. అప్పుడు దీపా తన ప్లాన్ పసిగట్టేసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Karthika Deepam 12 Sep Today Episode : దీప ప్లాన్ సక్సెస్.. మోనితపై మండిపడ్డ కార్తీక్.. సంతోషంలో దీప..?

Exit mobile version