Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu january 18 Today Episode: వసుని కొట్టబోయిన జగతి.. వసుని అవాయిడ్ చేస్తున్న రిషి?

Guppedantha Manasu january 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి వసుధార మీద సీరియస్ అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతి ఇప్పుడు ఈ జీబీఎస్టి కాలేజ్ కొత్త ఎండి అనడంతో వసుధర షాక్ అవుతుంది. పాత ఎండి ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవచ్చా మేడం అనగా తెలియని భవిష్యత్తును వెతుక్కుంటూ మాకు ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్లిపోయాడు జగతి. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది మేడం అనడంతో మళ్లీ ఎందుకు వచ్చావు వసుధార అని అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర కోపంతో మాట్లాడరేంటి వసుధార గారు, మా అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి వెళ్దామని వచ్చారా లేక ఉన్నాడా పోయాడా అని తెలుసుకోవడానికి వచ్చారా అనడంతో, సార్ మీరు నన్ను మేడం,గారు అని పిలవడం ఏంటి అనడంతో నువ్వు మా పాత వసుధార కాదు కదా మారిపోయావు.

Guppedantha Manasu january 18 Today Episode

మీరు పెద్దవాళ్ళు అయ్యారు అని అంటాడు మహేంద్ర. అప్పుడు జగతి అయినా తనతో మాటలే మహేంద్ర కొంతమంది గొప్ప గొప్ప చదువులు చదివి ర్యాంకులు సాధిస్తారు కలలు కంటారు ఆ కలలు సహకారం అయిన తర్వాత వాటికి కారణమైన దారిని మనుషులను మరిచిపోయి వేరే లోకాన్ని వెతుక్కుంటారు అని అంటుంది. అప్పుడు వసుధార అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుండగా వెంటనే జగతి ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి వసుధార నీ కంటికి ఎలా కనిపిస్తున్నాము అనడంతో చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వాళ్లకి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

మరోవైపు వసుధార మళ్ళీ ఎందుకు వచ్చింది ఎందుకు నా వెంట పడుతుంది గాయం చేసింది తానే కదా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు వసుధార వెళ్ళి మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా ఒక సీట్లో కూర్చుని థిస్ ఈసారి ఎందుకు నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు మా జెంటిల్మెన్ అలిగినట్టు ఉన్నాడు కోపం వచ్చినట్టు ఉంది నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా అని ఫోన్ చేయగా రిషి ఫోన్ కట్ చేస్తాడు. అయిన వసుధార పదేపదే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలోని రిషికి వసుధారనే ఫోన్ చేసింది అనుకొని ఎయిర్పోర్ట్ వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనడంతో సరే అంటాడు రిషి. మరొకవైపు వసుధార పేపర్లో స్వారీ అనే రిషి ఫోటో చూసి రాస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి మహేంద్ర వస్తారు.

అప్పుడు జగతి ఏమనుకుంటున్నావు వసుధార అసలు ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా అనగా ఏమైంది మేడమ్ అనడంతో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాను అంత చేసి కూడా నువ్వు ఏమీ తెలియదు అంటగా నవ్వుతూ మాట్లాడిస్తున్నావు అనడంతో సమయం వచ్చినప్పుడు అన్ని అందరికీ అర్థం అయ్యేలా చెబుతాను అని అంటుంది. వసుదరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు మాకు కోపం తెప్పించకు అసలు ఏం జరిగిందో చెప్పు అని అనడంతో మహేంద్ర కూడా జగతి మేడం అడుగుతుంది కదా చెప్పు వసుధార అని అంటాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాను అని మళ్ళీ వసు అదే మాట అనడంతో జగతి కోపంతో వసుని కొట్టబోతుంది. అప్పుడు మహేంద్ర చిన్న పిల్లలకు దండం పెట్టకూడదు అంటారు కానీ దండం పెట్టి అడుగుతున్నాను ఇక్కడికి ఎందుకు వచ్చావు వసుధర వెళ్ళిపో అని అంటాడు. అపుడు వసు మౌనంగా ఉంటుంది.

సారీ చెప్తే విరిగిన మనసులు అతుక్కుంటూయా వెళ్ళిన మనుషులు తిరిగి వస్తారు అనడంతో రిషి సార్ ఎక్కడికి వెళ్ళాడు మేడం అనగా తెలియదు ఒకవేళ తెలిసినా చెప్పను అని జగతి మహేంద్ర నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జగతి వెళ్ళిపోతూ రిషి ఎక్కడికి వెళ్లాడో తెలియదు ఇక్కడికి రాడు నిన్ను కలవడు తెలిసిన మాకు చెప్పము అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వసుధార ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఎంతలోనే పుష్ప అక్కడికి రావడంతో ఏంటి వసుధారని పెళ్లి పై చాలా ఆశలు పెట్టుకున్నాను ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావు అనుకోలేదు అంటుంది పుష్ప. అప్పుడు వసు సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను పుష్ప. నాకు సహాయం కావాలి నాకు ఒక రూమ్ కావాలి అనడంతో సరే పదా అని వెళ్తారు.

Advertisement

మరొకవైపు మహేంద్ర జగతి అసలు విషయం చెప్పడంతో దేవయానికి కోపంతో రగిలిపోవడంతో ఆ వసుధార మళ్ళీ రావడం ఏంటి అనగా తను మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఉంది అక్కయ్య అందుకే వచ్చింది అని నాకు కాలేజీ మనదే కదా తీసిపారేయండి అనడంతో అలా కుదరదు వదిన గారు, వసు మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ద్వారా వచ్చింది అని అంటుంది. అసలేం జరుగుతోంది రిషిని ఏం చేయాలి అనుకుంటున్నారు.. నేను చెప్తే వినలేదు అలాంటి వాళ్ళని ఇంట్లోకి పిలుచుకొని వచ్చి నెత్తిన పెట్టుకున్నారు అని మహేంద్ర దంపతులపై సీరియస్ అవుతూ ఉండగా ఇంతలోనే రిషి సార్ అని గట్టిగా అరుచుకుంటూ ఇంటికి వస్తుంది వసుధార. అప్పుడు దేవయాని ఏంటి నువ్వు ఏదో మీ అత్తగారిల్లు అన్నట్టు నేరుగాలి లోపలికి వచ్చావు అనగా మేడం నేను రిషి సార్ తో మాట్లాడాలి అనడంతో నీకు సిగ్గుగా లేదా అని అంటుంది దేవయాని.

Read Also : Guppedantha Manasu january 17 Today Episode : జగతిని ఎండీగా నియమించిన రిషి.. వసుని చూసి షాకైన జగతి మహేంద్ర?

Advertisement
Exit mobile version