Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu: పెళ్లి చేసుకున్న వసు రిషి.. షాక్ లో దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి మహేంద్ర,వసుధారపై కోపంగా అరుస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్లో జగతి కోపంగా అరుస్తూ ఉండడంతో మహేంద్ర ఏమయ్యింది జగతి అని అడుగుతాడు. ఇక్కడ మీ వల్ల జీవితం నాశనం అవుతున్నాయి అని గట్టిగా అరుస్తుంది. దేవయాని అక్కయ్యకు అవకాశం ఇవ్వకూడదు అనుకున్న ప్రతిసారి మీరు ఏదో ఒకరకంగా ఆమెకు అవకాశం ఇస్తూనే ఉన్నారు ఎంత చెప్పినా వినడం లేదు అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది జగతి.

Advertisement

అప్పుడు వసుధార మధ్యలో మాట్లాడడంతో నువ్వు మాట్లాడక వసు అంటూ వసుధార పై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది దేవయాని. అప్పుడు మహేంద్ర వసుధారని ఎక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతాడు. అప్పుడు జగతి వెళ్లొద్దు వసు నేను చెప్పేది విను వసు అని అంటూ ఉంటుంది. అప్పుడు జగతి, తన బాధను మహేంద్ర తో చెప్పుకొని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఇంతలోనే జగతి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో టెన్షన్ పడిన మహేంద్ర జగతి,జగతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. మరొకవైపు రిషి కారులో వెళుతూ ఉండగా ఇంతలో ధరణి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఈ విషయం కచ్చితంగా వసుధారకు తెలిసే ఉంటుంది అని అనుకుంటాడు రిషి.

మరొకవైపు డాక్టర్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడు మహేంద్ర ఏం జరిగింది డాక్టర్ అని అనటంతో ఈమె ఏదో మానసికంగా స్ట్రెస్ కి గురైంది అని అంటుంది డాక్టర్. ఆ తర్వాత డాక్టర్ వెళ్తూ ఉండగా దేవయాని అడ్డుపడి పైనున్న ఆవిడ ఎలా ఉంది. చస్తాదా లేక బతికే ఉంటుందా అని అడగగా మీరు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది డాక్టర్.

Advertisement

ఇప్పుడు సర్లే డాక్టర్ మేము బాగానే చూసుకుంటాము అని డాక్టర్ని పంపిస్తుంది. మరొకవైపు రిషి కాఫీ షాప్ కి బయలుదేరుతాడు. ఇప్పుడు ఆర్డర్ కోసం రావడంతో అసలు ఏం జరుగుతుంది వసు అని అడగగా ఏమైంది సార్ అని అనడంతో జగతి మేడం ఎందుకు కింద పడిపోయారు అని అనగా వసు టెన్షన్ పడుతూ ఉండడంతో రిషి అసలు విషయం చెప్తాడు.

అప్పుడు వసు టెన్షన్ పడుతూ ఉండడంతో సరే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటా వెళ్దాం అని అంటాడు రిషి. మరొకవైపు మహేంద్ర జగతికి మందులు ఇస్తూ ఉంటాడు. హాల్లో కూర్చున్న దేవయాని వసు,రిషి లను విడగొట్టాలి అని అనుకుంటూ ధరణి కు పనులు చెబుతుంది. ఇంతలోనే రిషి,వసు అక్కడికి పెళ్లి చేసుకొని వస్తారు. అది చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు రిషి దేవయానిని పిలిచి పెద్దమ్మ ఏం జరిగింది అలా చూస్తున్నారు అని అనగా ఏం లేదు రిషి అని అనడంతో రిషి వసుధారని తీసుకొని జగతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మొదట జగతి దగ్గరికి వసు వెళ్తుంది. అప్పుడు జగతి,వసు దగ్గరికి వెళ్లి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. వారి మాటలు బయట నుంచి రిషి వింటూ ఉంటాడు. జగతి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement
Exit mobile version