Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu Oct 14 Today Episode : వసుకి ప్రేమతో చీర తెచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu Oct 14 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు,రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ నేను కొన్ని చీరలు మంచంపై పెడతాను అందులో నీకు ఏది కావాలో అది తీసుకో వసుధార అని అంటాడు రిషి. అప్పుడు రిషి నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మాత్రం అడగొద్దు ఇక్కడే వెయిట్ చెయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు గౌతమ్ ఇంకా రాలేదు ఏంటి వాళ్ళని పిలుస్తాను అని అనగా వెంటనే జగతి వద్దు అంటూ సైగలు చేస్తుంది.

Guppedantha Manasu Oct 14 Today Episode

మరొకవైపు వసు, రిషి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి వస్తూ ఇచ్చిన బొమ్మలను అక్కడ పెడతాడు. ఇప్పుడు వసు సార్ చాలా బాగుంది కదా అని అనడంతో వెంటనే వారిద్దరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటారు. మరొకవైపు దేవయాని ఏం చేస్తున్నారు వీళ్ళు పైన ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మహేంద్ర కూడా ఏం రాలేదు అని అనగా ఏం కాదులే అని జగతి అనగా అప్పుడు ఇక్కడే ఉంటే కుదరదు పైకి వెళ్లి పిలవాలి అని దేవయాని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి,వసు లు వస్తారు.

Advertisement

అప్పుడు వసు చేతిలో బొమ్మలు చూసి ఏంటి అవి అని అడగగా నేను చేశాను మేడం అని అంటుంది వసుధార. ఆ తర్వాత గౌతమ్ బొమ్మలు బాగున్నాయి అని వారికి ఫోటో తీస్తూ ఉండగా ఇంతకుముందే తీసుకున్నాము అని చెప్పబోతూ ఉండడంతో రిషి, వసు ని ఆపుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి బొమ్మల కొలువు చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరు వారి మనసులోని కోరికలను కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు గౌతమ్ అందరికీ వినిపించే విధంగా ఈ రిషి గాడికి కోపం తగ్గితే చాలు దేవుడా నాకేం ఇంకా కోరికలు లేవు అనటంతో అందరూ నవ్వుతారు. గౌతమ్ అందరికీ ఫోటోలు తీస్తాడు.

Guppedantha Manasu అక్టోబర్ 14 ఎపిసోడ్ : ఈ చీర కట్టుకుంటే మీ ఇంటికి సగం కోడల్ని అయినట్టేనన్న వసుధార  

అప్పుడు గౌతమ్ పెద్దమ్మ ఈ బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు అని అనగా దేవయాని ఆన్సర్ తెలియక తడపడుతూ ఉండడంతో వెంటనే వసుధార అసలు విషయాన్నీ చెప్పేస్తుంది. ఆ తర్వాత రిషి పైకి వెళ్లి వసుధార కోసం ఒక చీరను తీసుకొని వస్తాడు. అప్పుడు మేడం ఈ చీర మా నానమ్మది కనుక ఈ సందర్భంగా ఈ చీరని మీ చేతులతో వసుధారకి ఇవ్వాలి అనుకుంటున్నాను అనడంతో కోపంతో రగిలిపోయి అడ్డుకుంటూ ఉంటుంది.

అప్పుడు దేవయాని అడ్డుకోవడంతో రిషి ఏం కాదులే పెద్దమ్మ అని అంటాడు. తర్వాత వసుధార ఆలోచిస్తూ ఆచరణ తీసుకొని పైకి రూమ్ లోకి వెళుతుంది. అప్పుడు వసుధర ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జగతి ఎక్కడికి వచ్చి ఏం జరిగింది వసు అని అనగా ఈ చీర కట్టుకుంటే నేను మీ ఇంటికి సగం కోడల్ని అయినట్టే కదా మేడం అని అంటుంది. అప్పుడు వసుధార ఆలోచిస్తూ ఉండగా జగతి ఏం కాదు అని సర్ది చెబుతుంది.

Advertisement

అప్పుడు మహేంద్ర కూడా అక్కడికి రావడంతో అనవసరంగా గురుదక్షిణ ఒప్పందం చేసి గొడవని పెద్దది చేసినట్టున్నాము అనడంతో వెంటనే జగతి నేను తర్వాత వస్తాను మహేంద్ర నువ్వు కిందకి వెళ్ళు అని అంటుంది. వారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.

Read Also : Guppedantha Manasu: వసుకి ప్రేమతో చీర తెచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Advertisement
Exit mobile version