Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi Lasya: ఇంటింటి గృహలక్ష్మి లాస్య కష్టాలు అన్నీ ఇన్నా కావు.. ఎండలో పరుగో పరుగు!

Intinti Gruhalakshmi Lasya: ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లి తెరపై మంచి ప్రేక్షాకాదరణ పొందుతోంది. కార్తీకదీపం సీరియల్‌ను ఎప్పుడో వెనక్కి నెట్టిన ఈ కొత్త ధారవాహిక మంచి టీఆర్‌పీ రేటింగ్‌లను సైతం అందుకుంటోంది. ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణ తెచ్చుకుందని చెప్పాలి. ఇందులో ప్రధాన పాత్ర అయిన తులసి చాలా మందికి కనెక్ట్ అయింది. అలాగే విలన్ షేడ్స్ ఉన్న పాత్ర అయిన లాస్య పాత్రలో యాంకర్ ప్రశాంతికి ఎన్నడూ రానంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. లాస్యగా చాలా ఫేమస్ అయిందనే చెప్పాలి.

ఎక్కడికి వెళ్లిన తనను అందరూ గుర్తిస్తున్నారు. విలన్‌ పాత్రలో చేస్తున్నప్పటికీ తనకు ఆదరణ పెద్దగానే ఉంటోంది. లాస్య పాత్రలో తనదైన ముద్ర వేసిన ప్రశాంతి.. నటనలో మంచి మార్కులు సంపాదించింది. లాస్యగా ప్రశాంతి స్క్రీన్ పై ఎలా కనిపించినా కూడా తెర వెనక మాత్రం తన పేరుకు తగ్గట్లే ప్రశాంతంగా ఉంటుంది. కూల్‌గా అందరితో కలివిడిగా మెలుగుతుంది. సెట్‌లో ఉన్న వారితో సరదాగా గడుపుతుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రశాంతి అంటే చాలా మందికి ఇష్టమేనట.

Advertisement

ప్రశాంతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. గృహలక్ష్మీ షూటింగ్ విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా లాస్య ఎండలో బాగానే కష్టపడుతున్నట్టు కనిపించింది. ఎర్రటి ఎండలో షూటింగ్ చేస్తుండటంతో.. లాస్య బెంబేలెత్తిపోయినట్లు కనిపిస్తోంది. ఎండకు తాళలేక ఏసీ లేదు కదా? అని అంటూ.. పక్కనే ఉన్న ఆటోలో కూర్చుంటుంది.

Exit mobile version