Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Huzurabad By-election : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

Huzurabad By-election

Huzurabad By-election

Huzurabad By-election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘన్ముక్లలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తులు అడ్డుకున్నారు.

పోలింగ్ జరిగే బూత్ దగ్గర ఆయన ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. మరోవైపు వీణవంకలోనూ రెండు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. కోర్కల్‌ పోలింగ్ వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.

ఇరువర్గాలు నువ్వానేనా అంటూ గొడవకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇల్లంధకుంటలో శ్రీరాములపల్లి గ్రామంలో ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారంటూ గజ్వెల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌పై ప్రత్యర్థి మద్దతుదారులు మండిపడ్డారు.

Advertisement

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ దగ్గర బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Exit mobile version