Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : మూడు ముళ్ల బంధానికిచ్చే విలువ ఇలా ఉండాలి, మీరే చూడండి!

Viral Video : భార్యాభర్తల బంధానికి రోజురోజుకూ విలువ లేకుండా పోతోంది. ఒకరినొకరు తిట్టుకోవడం, వేరే వాళ్ల వద్ద ప్రేమను వెతుక్కోవడం,.. అవి కాస్తా వివాహేతర సంబంధాలకు దారి తీయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. వాటి వల్ల కట్టుకున్న వాళ్లతో పాటు, తమను కన్నవాళ్లను, తమని కన్న వాళ్లని కూడా కాటికి పంపేందుకు ఆళోచించడం లేదు. అయితే ఇది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. భర్త తన భార్యపై చూపించే ప్రేమ చూస్తే.. పెళ్లనే బంధానికి అందరూ ఇవ్వాల్సిన విలువ ఇదే అని అర్థం అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరే ఓసారి చూడండి.

Husband love on his Wife Video goes Viral

ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్నాడు. బస్సు రావడానికి సమయం ఉండడంతో అలిసిపోయిన భార్య… భర్త ఒడిలో సేద తీర్చుకుంటుంది. భర్త కూడా ఏమాత్రం నొచ్చుకోకుకండా… భార్య అన్న ప్రేమను చూపించాడు. ఆమెను ఒళ్లో పడుకోబెట్టుకుని తలపై చేతితో నిమురుతూ చంటి పిల్లను చూసుకున్నట్లు చూసుకున్నాడు. అయితే అతనికి కూడా నిద్ర వస్తున్నప్పటికీ… భార్యను హాయిగా ఒళ్లో పడుకోబెట్టుకున్నాడు.

భార్య పట్ల భర్త గుండెల నిండా ఉన్న ఆ ప్రేమకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ప్రేమ, పెళ్లి బంధానికి మీరు ప్రత్యేక నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే 57 వేల మంది ఈ వీడియోను చూశారు. వీరి ప్రేమ, గొప్పదని ఎంతో మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Advertisement

READ Also : Viral Video : బాబోయ్.. ఈ యువతి నడుమును బొంగరంలా ఎలా తిప్పుతుందో చూడండి.. కుర్రాళ్లలో సెగలు పుట్టించే వీడియో..!

Exit mobile version