Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Interesting news: వర్షంతో పాటు వచ్చి పడ్డ భారీ ఇనుప బంతులు.. అవి ఏమిటంటే..?

Interesting news: ఆకాశం నుంచి రాళ్లు పడుతుంటాయి. రాళ్లు అంటే వడగండ్లు, అంటే ఐస్ ముక్కలు. దానినే రాళ్ల వాన అని కూడా అంటారు. అలాగే కొన్ని చోట్ల కప్పలు పడ్డాయన్న వార్తలు కూడా వినే ఉంటారు. కొన్ని కోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి చేపలు పడటం కూడా తలెత్తిన వార్తలు వినే ఉంటారు చాలా మంది. అలాగే ఆకాం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసులు ఉన్నారన్న చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

వేకువజామున ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య బంతుల్లాంటి ఆకారంలో ఉన్న భారీ గోళాలు భూమిపైకి దూసుకొచ్చాయి. వాటిని చూసి రైతులు తీవ్రంగా భయపడ్డారు. తీరా సంబంధిత వార్తత అధికారులకు తెలియడంతో వారు అక్కడికి వచ్చి అసలు విషయం బయట పెట్టారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలో ఈ బంతులు పడ్డాయి. జిల్లా పిరధిళోని 3 గ్రామాల్లో భారీ గోళాలు పడటం కలవరపెట్టింది.

Advertisement

అలాగే ఖేడా జిల్లా పరిధిలో శుక్రవారం వేకువ జామున బుల్లెట్ల ఆకారంలో ఉన్న వస్తువులు నేలపై పడ్డాయి. అయితే పొలాల్లో పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. గమించిన స్థానికులు భయాందోళన చెందారు. ఈ వస్తువులు శాటిలైట్ కు సంబంధించిన వస్తువులుగా అధికారులు అనుమానించారు. ఇస్త్రో శాస్త్రవేత్తలకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Exit mobile version