Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chaiwala priyanka: మరో కొత్త బిజినెస్ ను ప్రారంభించిన ఛాయ్ వాలా ప్రియాంక..!

Chaiwala priyanka: మంచి ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చని ఇప్పటి యువత నిరూపిస్తోంది. తమ తమ ఆలోచనలతో తక్కువ పెట్టుబడి పెట్టే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మరికొంత మంది మాత్రం ఆ ఆలోచన మానుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అమ్మాయిలు మహా మొండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు. అంతే కాదండోయ్ ప్రారంభించిన పనిని మధ్యలో అస్సలే వదిలేయరు. అయితే ఇందులో చాయ్ వాలా ప్రియాం ఒకరు. డిగ్రీ పట్టా పుచ్చుకొని కాళ్లరిగేలా ఉద్యోగం కోసం తిరిగి చివరకు చాయ్ వాలాగా మారింది. గ్రాడ్యువేట్ చాయ్ వాలాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మరో కొత్త బిజినెస్ ను ప్రారంభించింది.

గ్రాడ్యుయేట్ అయిన ప్రియాంక గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి… ఆమె బిజినెస్ ను మరింత విస్తరించేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్ ను అందించారు. దాంతో పేరును అందించిన టీ కొట్టును పూర్తిగా ఎత్తేసినా మరికొందరు సిబ్బందితో కలిసి ఫుడ్ ట్రక్ ను నడిపిస్తోంది. దాంతో ప్రియాంక కథ మరోసారి సోషన్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version