Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Free LPG Cylinders : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్!

Free LPG Cylinders : రేషన్ కార్డు దారులు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు ఉత్తారాఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ధరల పెరుగుదలతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే సాయంగా నిలావలని ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

Free LPG Gas for ration card holders in uthharakhand

ప్రభుత్వ పథకం ప్రకారం.. అంత్యోదయ కార్డు హోల్డర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు కేటాయించిందట. దీని ద్వారా మొత్తం లక్షా 84 వేల 142 మంది అంత్యోదయ కార్డు దారులు ప్రయోజనం పొందుతారు.

ఉచిత ఎల్పీజీ గ్యాస్ తో పాటు గతేడాది గోధుమలు కొనుగోలు చేసిన రైతులకు క్వింటాల్ కు 20 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ప్రతీ ఏటా 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందాలంటే కొన్ని షరతులు పాటించాలి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.

Advertisement
  1. లబ్ధిదారుడు ఉత్తరాఖండ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  2. వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డు పొంది ఉండాలి.
  3. అంత్యోదయ రేషన్ కార్డు హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేస్కోవాలి.

Read Also :  LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

Exit mobile version