Tirupati: ఈ రోజుల్లో దేశంలో జనాభా సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో వల్ల దేశంలో ఉన్న అడవులు మాయమయి ఇల్లు వెలుస్తున్నాయి. అందువల్ల అడవిలో ఉండాల్సిన జంతువులు, పక్షులు, కీటకాలు అప్పుడప్పుడు జనావాసాల మధ్య దర్శనమిస్తున్నాయి. అచ్చం ఇటువంటి సంఘటన తిరుపతి లో చోటు చేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన సర్పం ఇంట్లో దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే..తిరుమల బాలాజీ నగర్ లోని ఓ ఇంట్లో పాము హల్చల్ చేసింది.
దీంతో కుటుంబసభ్యులు ఆ వింత శబ్దాలు కు గల కారణం గురించి తెలుసుకోవడానికి లోపలికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అడవుల్లో ఉండాల్సిన పెద్ద సర్పం కిచెన్ లో దర్శనం ఇచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే భాస్కర్ నాయుడు అనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు.
భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని కిచెన్ లో తిరుగుతున్న పాముని చాకచక్యంగా తన చేతులతో బంధించి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశాడు. ఈ ఘటన మొత్తం కుటుంబ సభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషియల్ మీడియా లో వైరల్ గా మారింది. దయచేసి అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించేవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇటువంటి విష సర్పాల కారణంగా ప్రమాదం ఎదుర్కోవల్సి వస్తుంది.
- Deepthi Sunaina: పెళ్లి కూతురు గెటప్ లో మంచు కొండలలో స్టన్నింగ్ లుక్ లో దీప్తి సునైనా… వీడియో వైరల్!
- Viral Video: బండి పైకెక్కి చీరకట్టులో స్టంట్ చేయాలని ప్రయత్నించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు?
- Neha Sharma : జిమ్లో వర్కౌట్ పేరుతో అందాలను ఆరబోస్తూ… కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!
