Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

LPG Gas cylinder: వినియోగదారులకు షాక్… మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు!

LPG Gas cylinder : వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. పెరిగిన అన్ని ధరల కారణంగా.. సామాన్య ప్రజలు వంట చేసేందుకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధర మోత మోగుతుంటే… గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచుతూ… చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్ పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరింది. అదే హైదరాబాద్ లో 14 కిలోల సిలిండర్ ధర రూ.1052 కి చేరింది.

LPG Gas cylinder

గత కొంత కాలం క్రితమే చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్​ ధరను పెంచాయి. మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్​ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్​ బండ రూ.2355.50కి చేరింది. 5 కిలోల ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ.655కు పెంచారు. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్‌ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

Advertisement
Exit mobile version