Actress: ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వాతావరణ మార్పులు, రోజువారి జీవన శైలి వల్ల అంతుపట్టని వ్యాధులు దరి చేరుతున్నాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా సూచనలు పాటిస్తున్నారు. అయితే అందం తో పాటు, ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం తప్పనిసరి. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే తప్పకుండా పాటించవలసిందే. అందుకే చాలా మంది సినీ తారలు కసరత్తులు చేస్తూ జిమ్ముల్లో కనిపిస్తుంటారు.
మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి, అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా ఈమె కూడా నిపుణుల వర్యవేక్షణలో తగిన సూచనలు పాటిస్తూ, కసరత్తులు చేస్తోంది. తెలుగులో పలు హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో చేసి తన టాలెంట్ ను నిరూపించుకుంటోంది ఈ భామ. సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్యతో కలసి థాంక్యూ సినిమాలో నటించారు.