Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha serial Sep 15 Today Episode : ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ పై కోపంతో రగిలిపోతున్న జానకి..?

Devatha serial September 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ, దేవిని కరాటి క్లాస్ కి వెళ్లడం కోసం రెడీ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధ దేవికి జడ వేస్తూ ఉండగా అది చూసి చిన్మయి సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మాధవ కావాలనే అక్కడికి గడ్డం తీసుకుంటున్నట్టుగా అక్కడికి వచ్చి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు చిన్మయి, రాధ వైపు బాధ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. అప్పుడు మాధవ అద్దంలో రాధ వైపు చూస్తూ ముద్దు పెట్టుకోవడం చూసి జానకి షాక్ అవుతుంది.

Devudamma questions Adithya about his unusual behaviour with Satya in todays devatha serial episode

ఇప్పుడు మాధవ రెండు నిమిషాలు ఆగు దేవి నేను వస్తాను అని అనగా అవసరం లేదు నేను తోలుకొని పోతాను ఉంటుంది రాద. అప్పుడు రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోగా జానకి ఏంటి వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని కోపంతో తగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య, రాధ చెప్పిన మాటలు తలచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ వస్తుంది.

అప్పుడు దేవుడమ్మ నీలో వచ్చిన మార్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు ఆదిత్య అని అనగా ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు సత్య అన్న మాటలు గురించి మాట్లాడుతూ సత్య ఈ విషయంలో చాలా బాధపడుతుంది ఆదిత్య అని అంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. సత్య ని ఇంకెప్పుడు బాధ పెట్టకు ఆదిత్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడమ్మ. మరొకవైపు రాధ,భాగ్యమ్మ, దేవిని కరాటే క్లాస్ దగ్గరకి తీసుకొని వస్తారు.

Advertisement

అప్పుడు దేవి చేసే విన్యాసాలు చూసి వారిద్దరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు భాగ్యమ్మ రాధ నీ ఆలోచనలు ఏంటో నాకు అర్థం కాదు అనగా అప్పుడు రాధ చిన్మయి గురించి చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్మయి అన్న మాటలను భాగ్యమతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది రాధ. మరొకవైపు సత్య , ఫోన్లో ఆదిత్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, సత్య దగ్గరికి వస్తాడు. ఆదిత్య మాట్లాడుతుండగా సత్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Devatha serial Sep 15 Today Episode : రుక్కుకి ఫోటో తీస్తూ జానకమ్మ కి దొరికిన మాధవ్ పై కోపంతో రగిలిపోతున్న జానకి..

నేను నిన్ను బాధ పెట్టాను కదా నువ్వు కూడా నన్ను బాధ పెట్టవచ్చు, నన్ను తిట్టొచ్చు కదా అని అనగా వెంటనే సత్యాన్ని నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు కోప్పడడం రాదు ఆదిత్య అనడంతో ఆదిత్య మరింత బాధపడతాడు. అప్పుడు ఆదిత్య సత్యను దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు. అప్పుడు సత్య ఆదిత్య తనని అన్న మాటలు అన్ని గుర్తుచేస్తుంది.. పిల్లల కోసం వెళ్దాము అన్నావు మళ్లీ ఏం మాట్లాడలేదు అంటూ ఎమోషనల్ అవుతుంది సత్య.

కానీ ఆదిత్య మాత్రం ఏం మాట్లాడకుండా సత్య మాట్లాడుతున్న మాటలు విని మరింత బాధపడతాడు. అప్పుడు సత్య బయటికి వెళ్లి తిరుగుదాము కలిసి తిందామని అనడంతో సరే అలాగే వెళ్దాం వెళ్లి రెడీ అవ్వు సత్య అని అంటాడు. ఆ మాటకు సత్య సంతోషపడుతుంది. మరొకవైపు మాధవ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే జానకి అక్కడికి వస్తుంది. జానకి కోపంతో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి ఆ గిటారు వాయించడం ఏంటి అని అడుగుతుంది. నువ్వు ఇంతకుముందులా లేవు నీలో ఏదో మార్పు నాకు కనిపిస్తోంది అని అంటుంది. కానీ మాధవ మాత్రం అలా ఏమీ లేదు అమ్మ అని అబద్ధం చెబుతాడు. ఇంతలో మాధవ అని జానకి నిలదీస్తూ ఉండగా అక్కడికి దేవి సంతోషంతో వస్తుంది. దేవి మాటలకు రామ్మూర్తి కుటుంబ సభ్యులు అందరూ సంతోషపడుతూ ఉంటారు.

Advertisement

Read Also : Devatha serial Sep 14 Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాధ.. షాక్ లో మాధవ..?

Exit mobile version