Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu june 6 Today Episode : వసును తలుచుకుంటూ యాక్సిడెంట్ కి గురైన రిషి… మాటలతో బాధ పెట్టిన దేవయాని!

Guppedantha Manasu june 6 Today Episode : బుల్లితెరపై ప్రసారమౌతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు విశేష ఆదరణ సంపాదించుకొని అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం రిషి వసుంధరకు ప్రపోజ్ చేయడం, వసుధార రిజెక్ట్ చేయడంతో సీరియల్ పై మరింత ఆత్రుత ఏర్పడింది. ఇకపోతే గత ఎపిసోడ్ లో భాగంగా వసుధార రిషికి సారీ చెబుతూ నోట్ బుక్ మొత్తం రాసి ఉంటుంది. ఇక అది చూసిన జగతి మహేంద్ర అసలు వీళ్ళు ఏంటో అర్థం కారు అంటూ మాట్లాడుతారు.

ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా వసుధార కాలేజ్ నుంచి వస్తుండగా సాక్షి ఎదురు పడుతుంది. ఇక సాక్షి వసుధారణను రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. రిషి వసుధారా ఉన్న ఫోటోలను చూపిస్తూ ఈ ఫోటోలు కాలేజీ మొత్తం అతికించి రిషి ఫ్యామిలీ పరువు తీస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ మాటకు వసుధార నువ్వేం చేస్తావో చేసుకో అంటూ గట్టిగా సమాధానం చెబుతుంది. వసుధార మాటలకు సాక్షి షాక్ అవుతుంది. ఇప్పటికీ రిషి మనసులో నువ్వే ఉన్నావు అంటూ సాక్షి మాట్లాడగా అది నీ ప్రాబ్లం అంటూ సాక్షికి గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళుతుంది.

Guppedantha Manasu june 6 Today Episode

మహేంద్ర ముందుగా ఏదో ప్లాన్ చేసి జగతిని వసుధ రెస్టారెంట్ కి పంపిస్తారు.అదేవిధంగా మహేంద్ర రిషిని తన కారులో తీసుకొని రెస్టారెంట్ కి వెళ్తారు. ఎక్కడికి డాడీ అన్నా కానీ చెప్పకుండా వెళ్లి వసుధార రెస్టారెంట్ దగ్గర ఆపుతారు. అదే సమయంలో రిషి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ప్రయత్నించిన మహేంద్ర మాత్రం ఏవో మాటలు చెప్పి తననిలోపలికి తీసుకు వెళ్తాడు. అంతలో వసు వచ్చే ఆర్డర్ సర్ అని అడగగా మౌనంగా ఉంటాడు. అంతలో సాక్షి రావడంతో సాక్షి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడగడంతో సాక్షి ఎంతో సంతోష పడుతుంది.

Advertisement

ఇకపోతే కార్ డ్రైవింగ్ నేనే చేస్తాను అని చెప్పగా సాక్షి సంతోషిస్తూ రిషి పక్కన కూర్చుని తన మనసులో ఉన్న మాటలను చెబుతుంది. సాక్షి ఇలా మాట్లాడటంతో రిషి మధ్యలోనే కారు దిగి వెళ్ళిపోతాడు. ఇంకా రోడ్డుపై నడుచుకుంటూ రిషి వసుధార ఆలోచనలతో ముందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురవుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ప్రమాదానికి గురైన రీషిని చూసి వసు హాస్పిటల్ కి తీసుకువెళుతుంది. అయితే దేవయాని తన మాటలతో వసుధారను బాధ పెట్టినట్లు తెలుస్తోంది.

Read Also : Guppedantha Manasu june 4 Today Episode : రిషికి యాక్సిడెంట్.. బాధతో కుమిలిపోతున్న వసుధార..?

Advertisement
Exit mobile version