Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

College girl dance video: క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న కాలేజీ అమ్మాయి.. వీడియో వైరల్!

College girl dance video: పాఠశాలలో, కళాశాలల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి ఇష్టపడతారు. అయితే ఇటీవలే వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీ వల్లి పాట ఫీవర్ ఇంకా వదలట్లేదు. సినిమా రిలీజ్ నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ సినిమా పాటలు, డైలాగ్ లు ప్రజల నోళ్లలో నానిపోతున్నాయి. ఈ సినిమాలోని పాటకు ఇప్పటికీ డ్యాన్సులు చేస్తూ… వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోసస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ కళాశాల అమ్మాయి శ్రీ వల్లి పాటకు కాలేజీలోనే డ్యాన్స్ చేసింది.

సడెన్ గా గ్రౌండ్ లో అమ్మాయి డ్యాన్స్ వేస్తుండగా… తోటి వారంతా వచ్చి ఆనందంతో చప్పట్లు కొడ్తూ చూశారు. ఇంత బాగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుందంటూ సెల్ ఫోన్ లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే అందరూ క్లాసికల్ డ్యాన్స్ మర్చిపోతున్న ఈ సమయంలో ఆమె చక్కగా డ్యాన్స్ వేయడంతో తక్కువ సమయంలో ఎక్కువ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందీ అమ్మాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Exit mobile version