Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Charmi Kaur: లైగర్ దెబ్బతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఛార్మీ… ఇకపై వాటికి దూరం!

Charmi Kaur: హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఛార్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఛార్మీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా మారి దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించటం ప్రారంబించింది. ఇలా నిర్మాతగా మారిన ఛార్మి సినిమాలు నిర్మించడం కోసం తనకున్న ఆస్తులు కూడా అమ్ముకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఎక్కువ మొత్తం లాభాలు మూటగట్టుకొని పోయిన ఆస్తులన్నీ తిరిగి సంపాదించుకున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ కావడంతో ఇటీవల భారీ బడ్జెట్ తో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలు తారుమారు చేస్తూ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన డబ్బులో కనీసం 25% కూడా రాబట్టలేకపాయింది. దీంతో పూరీ, ఛార్మీ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ సినిమా మీద విజయ్ అండ్ టీమ్ క్రియేట్ చేసిన హైప్ తో డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా రైట్స్ ని దక్కించుకున్నారు. అయితే సినిమా విడుదలైన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వినిపించటం ప్రేక్షకులు సినిమా చూడటానికి వెళ్ళాక డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయి పూరి జగన్నాథ్, చార్మి మీద ఒత్తిడి చేస్తున్నారు.

దీంతో పూరి జగన్నాథ్,విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన సినిమా రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ ధరకు ఇచ్చి ఈ ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కాలని పూరి ఛార్మి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయంలో కూడా వారికి ఎదురు దెబ్బ తగిలింది. లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో జనగణమన సినిమాకి నిర్మాతగా ఉన్న మై హోమ్ గ్రూప్స్ సంస్థ వారు జనగణమన సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. జనగణమన భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న సినిమా కావటం వల్ల అధిక మొత్తంలో ఈ సినిమా మీద ఇన్వెష్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నారు.

Advertisement

Charmi Kaur:

దీంతో జనగణమన సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరోక నిర్మాత దొరికితే కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాదు. ఇలా అన్ని సమస్యలతో సతమతమవుతున్న ఛార్మీ వీటిని భరించలేక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి.. పూరి కనెక్ట్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు సెలవు, బతుకుదాం బ్రతకనిద్దాం.. అంటూ ట్వీట్ చేసింది. ఇలా లైగర్ ఎఫెక్ట్ తో సోషల్ మీడియాలో వీరి గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ భరించలేకే చార్మి సోషల్ మీడియాకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.

Advertisement
Exit mobile version