Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam July 7 Today Episode : బాధతో కుమిలిపోతున్న సౌర్య.. నిరుపమ్ కి,సౌర్యకి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చిన హిమ..?

Karthika Deepam July 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా జరిగిన విషయాన్ని తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య దంపతులు హిమ ముగ్గురు కలిసి సౌర్య దగ్గరికి వెళ్తారు. అక్కడ బయట ఆటో కింద పడిపోయి గందరగోళంగా ఉండడంతో ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూడగా శౌర్య బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య నేను ఆటో తోలడం లేదు వెళ్ళండి అని అనడంతో మేము ఆటో కోసం రాలేదు నీ కోసం వచ్చాను అని అంటుంది సౌందర్య. అప్పుడు వెంటనే సౌర్య నా పేరు జ్వాలా ఇక్కడ అందరూ నన్ను జ్వాలా అనే పిలుస్తారు.

Karthika Deepam July 7 Today Episode

ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అనడంతో సౌందర్య ఎందుకే ఇలా మాకు గుండెకోత కోస్తావు అని అనడంతో వెంటనే శౌర్య మీకు గుండె లేదు కదా అనడంతో సౌందర్య బాధపడుతుంది. ఆ తర్వాత ఇంకా మోసం చేయడానికి ఏముంది అందుకే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటుంది శౌర్య. అప్పుడు వెంటనే ఆనంద్ రావు ఎక్కడికి వెళ్తావు అని అనడంతో మోసాలు చేయని వారి దగ్గరికి అబద్దాలు చెప్పే వాళ్ళు లేని చోటకు వెళ్తాను అంటూ జ్వాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు సౌందర్య మేమందరు ఇక్కడే ఉన్నాము కదా అని అనగా ఇక్కడ మీరు ఉన్నారనే కదా నేను వెళుతుంది అని అనడంతో వారు బాధపడుతూ ఉంటారు.

Advertisement

తర్వాత ఆనందరావు తాతయ్య అంటే ఇష్టం కదా ఇప్పుడు మళ్ళీ తాతయ్యను వదిలేసి వెళ్తావా అని అనగానే, వెంటనే శౌర్య తాతయ్య, నానమ్మ ఈ పేర్లు పిలవడానికి బాగానే ఉంటాయి కదా, కానీ నేను ఆటో లంచ్ బాక్సులు తీసుకెళ్లినప్పుడు మీకు బాధ కలగలేదా అని అడగడంతో వారు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు సౌందర్య ఫైర్ అవుతూ నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు కదా ఎందుకు నానమ్మ తాతయ్య అని పిలవలేదు అడగగా అప్పుడు శౌర్య తన చేతి పై ఉన్న పచ్చబొట్టును చూపిస్తూ కారణమిదే అనడంతో హిమ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్వాలా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అమ్మానాన్న ఆత్మలు గోషిస్తాయి.

ప్లీజ్ దయచేసి వెళ్లొద్దు సౌర్య అంటూ చేతులు జోడించి మరి ప్రతిమలాడుతుంది సౌందర్య. అలా మొత్తానికి సౌందర్య కార్తీక్,దీపల పేర్లు చెప్పి సౌర్య వెళ్లకుండా ఆపేస్తుంది. ఆ తరువాత సౌందర్య వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వెంటనే చంద్రమ్మ,ఇంద్రుడు ఇంటికి వస్తారు. అక్కడ జరిగిందంతా చూసి జ్వాలా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండడంతో భయపడుతూ అమ్మ ఏమైంది చెప్పు అని అనగా జ్వాలా మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో హిమ వంట చేస్తూ ఉండగా అప్పుడు శౌర్య వచ్చి ఏం చేస్తున్నావు అని అనగా.. వంట చేస్తున్నాను సౌర్య ఎంతైనా మనం వంటలక్క కూతుర్లం కదా అని అనడంతో సౌర్యను బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు హిమ, కచ్చితంగా నీకు, డాక్టర్ సాబ్ కి పెళ్లి చేసి తీరుతాను అని మాట ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam july 6 Today Episode : హిమ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జ్వాలా.. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సౌర్య..?

Exit mobile version