Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : ఆంటీ చేతి వాటం.. ఎవ్వరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా ఫోన్ కొట్టేసి..!

Viral Video: ఈ మధ్యకాలంలో కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే వారి కంటే సులభంగా తమ తెలితేటలతో డబ్బు సంపాదించే వారు ఎక్కువయ్యారు. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజుల్లో ఎవరికీ అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారు. సాధారణంగా దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పట్టపగలే చుట్టూ జనాలు ఉన్న కూడా ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా పక్కవారి పర్సులు, బంగారు నగలు మొబైల్ ఫోన్ వంటివి దొంగలిస్తూ ఉంటారు. ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇటువంటి దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో లో మధ్య వయసు గల ఇద్దరు భార్యాభర్తలు ఒక షాపులో వస్తువులు కొని బిల్ వేస్తుండగా ఒక 50 సంవత్సరాల వయస్సు గల ఆంటీ షాప్ లోకి వస్తుంది. షాప్ లోకి వచ్చిన ఆ ఆ ఆంటీ కౌంటర్ వద్ద నిలబడి దుకాణాదారులు ఏదో వస్తువు కావాలని అడుగుతు కావాలనే పక్కన ఉన్న ఆంటీ ని తగులుతూ.. మీద పడుతూ ఉంటుంది.

Advertisement

ఆమె ప్రవర్తన అర్థం కాని సదరు మహిళ అయోమయంగా చూస్తుంది. సదరు మద్య మద్య వయసు ఉన్న ఆంటీ పక్కన వున్న మహిళను తరచు ఢీ కొడుతూ ఎవ్వరికి అనుమానం రాకుండా హ్యాండ్ బ్యాగు జిప్ తీసి ఎంతో చాకచక్యంగా ఫోన్ కొట్టేస్తుంది. వెంటనే షాప్ నుండీ బయటికి వెళ్ళిపోతుంది. కాని తన ఫోన్ పోయిన సంగతీ ఆమెకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ మొత్తం ఘటన షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో గిడ్డే అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వార షేర్ చేశారు. ఈ వీడియో చుసిన నెటిజన్లు ఆంటీ చాలా స్మార్ట్ గురు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version