Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

AP News: తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలు ఇవ్వాలి.. పేద ఇల్లు నిర్మాణాలకు అండగా నిలవాలి.. సీఎం జగన్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతగా నిర్దేశించుకున్నఅంశాలకు బ్యాంకుల సహకారం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలను మంజూరు చేసి అనగారిన వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా దోహదం చేయాలని ఈయన బ్యాంకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ రూ.3,19,480 కోట్లతో 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

ఇకపోతే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి పేదల గృహ నిర్మాణాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున పేద ప్రజలకు విలువైన భూములను పట్టాగా ఇచ్చామని, వీటిపై ప్రజలకు అప్పు ఇవ్వడం వల్ల బ్యాంకులకు సరైన భద్రత ఉంటుందని, ఈ విధంగా ప్రజలకు రుణాలు కల్పిస్తూ పేద ప్రజలకు బ్యాంకులు అండగా నిలబడాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరు చేసిన ఇల్లు నిర్మాణం చేపట్టడం ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ఉంటుందని తెలిపారు.

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్‌ కావడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశాలు చేశారు. ఇకపోతే వ్యవసాయ రంగంలో డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం బ్యాంకర్లు డ్రోన్ టెక్నాలజీ సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో పలు పథకాల అమలు గురించి కూడా ఆయన అధికారులతో చర్చించారు.

Advertisement
Exit mobile version