Pranitha Daughter: ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా సమయంలో కన్నడ వ్యాపార వేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్న ఈమెకు ఇటీవల పాప పుట్టింది. ఆ పాపకి ఆర్న అని పేరు పెట్టారు. తాజాగా మొదటి సారి ప్రణీత తన కూతురు మొహం కనపడేలా ఫొటోలను షేర్ చేసింది. కూతురు ఆర్నతో కలిసి ఆమె దిగిన క్యూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చందమామలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చేప కళ్ల సుందరి బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, రామయ్య వస్తావయ్యా… లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కన్నడలో కూడా చాలే సినిమాలు చేసింది ఆ అందాల ముద్దుగుమ్మ. కేవలం సినిమాలే కాదండోయ్ కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసి తన మంచితనాన్ని చాటుకుంది. అంతే కాదండోయ్ నోరు లేని మూగ జీవాల కోసం కూడా ఆమె ప్రచారాలు చేస్తుంటుంది.
