Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ ఎంత ఉంటుంది అంటే చాలా మంది మన అరచేతి పొడవు ఉంటుంది అని సమాధానం చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎత్తు ఉండే విస్కీ బాటిల్ గురించి విన్నారా. విస్కీ బాటిల్ ఏంటి? మనిషి ఎత్తు ఉండటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం అండి బాబు ఏకంగా 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే విస్కీ బాటిల్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంత అయితే ఉంటుందో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే గత ఏడాదే ఈ బాటిల్ గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోగా, తాజాగా ఈ బాటిల్ వేలం వేయాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలోనే మే 25వ తేదీ వేసే వేలంలో భాగంగా ఈ బాటిల్ ప్రారంభ ధరనే 1.3 మిలియన్ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఇలా ఈ బాటిల్ వేలం వేయగా వచ్చిన డబ్బులో 25% మేరీ క్యూరీ చారిటీ ట్రస్ట్ కోసం విరాళంగా ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.ఇలా ఒక మంచి పని చేయడం కోసమే భారీ విస్కీ బాటిల్ ను వేలం వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.