Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Niharika Konidela : శ్రీజ బాటలో నిహారిక.. మెగా డాటర్ భర్తను నిజంగానే దూరం పెట్టేసిందా?!

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. మొన్నటిదాకా శ్రీజ కొణిదెల మూడో పెళ్లి అంటూ పెద్దఎత్తున రుమర్లు చక్కర్లు కొట్టాయి. కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ.. ఒక పాప పుట్టిన తర్వాత అతడితో విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. శ్రీజ రెండో భర్తతో విడిపోయిన తర్వాత మూడో పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం జరిగింది.

Why Mega Daughter Niharika Konidela Avoid Chaitanya Jonnalagadda

శ్రీజ మూడో పెళ్లి విషయంలో చిరంజీవి కూడా చాలా సీరియస్ గా ఉన్నారని, ఆయనకు ఇష్టం లేకపోయినా కూతురు భవిష్యత్తు కోసం అంగీకరించారని, ఒక కండీషన్ ప్రకారమే పెళ్లికి ఒప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమమన్నాయి. ఇప్పటివరకూ మెగా కంపౌండ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి విషయాన్ని అధికారికంగా మెగా ఫ్యామిలీ సభ్యుల్లో ఎవరూ ప్రకటించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోసినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.

Why Mega Daughter Niharika Konidela Avoid Chaitanya Jonnalagadda

మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా తన భర్తను దూరం పెట్టిందని, వారిద్దరి మధ్య మాటల్లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిహారిక ఎప్పుడు బయట ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించినా భర్త చైతన్య జొన్నల గడ్డతో కలిసి సందడి చేస్తుండేది. ఎందుకో తెలియదు కొద్దిరోజులుగా నిహారిక ఎక్కడికి వెళ్లినా సింగిల్‌గానే కనిపిస్తోంది. సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలు, కిచులాటలు సహజమే. నిహారిక, ఆమె భర్త ఏమి జరిగిందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. శ్రీజలానే నిహారిక కూడా అలానే చేస్తుందా? అనే సినీ విశ్లేషుకులు అంటున్నారు. అందిన సమాచారం ప్రకారం.. నిహారిక తన భర్తను దూరం పెట్టినట్టు తెలిసింది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, నిహారిక కొన్నిరోజులుగా సింగిల్ గా కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Niharika Konidela : భర్తతో గొడవలే అసలు కారణమా? 

ఎందుకంటే.. నిహారిక పెళ్లి అయిన తర్వాత తన భర్తను ఎప్పుడు వదిలేది కాదంటున్నారు. ఇద్దరూ కలిసి సంతోషంగా చిలుకగోరింకల్లా కలిసి చూడముచ్చటగా తిరిగేవారు. ఎంతో జాలీగా గడిపేవారు. ఈ మధ్యన నిహారిక తన భర్తతో ఎక్కువగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లినా తన భర్త గురించి ప్రస్తావన తీసుకురావడం లేదట.. ఒకవేళ భర్త ఇక్కడ లేడా అంటే.. ఉన్నాడట.. భారత్‌‌లోనే ఉన్నాడని టాక్ నడుస్తోంది. అన్ని బాగుంటే మరి ఎందుకు నిహారిక తన భర్తకు దూరంగా ఉంటుందని మెగా అభిమానులు సైతం మండిపడుతున్నారు.

Why Mega Daughter Niharika Konidela Avoid Chaitanya Jonnalagadda

అందిన గాసిప్ ప్రకారం.. చైతన్య జొన్నలగడ్డకు నిహారికకు గొడవలు ఉన్నాయట.. అందుకే తన భర్తకు నిహారిక దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి భర్త దగ్గర కాకుండా తల్లిగారి ఇంట్లోనే నిహారిక ఉంటుందట. ఈ విషయంలో ఇద్దరికి సర్దిచెప్పేందుకు నాగబాబు కూడా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే శ్రీజ విషయంలో మెగా ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంటే.. నిహారిక విషయం మరో తలనొప్పిగా మారిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా పెద్దల మాట విని తన భర్తతో కలిసి అనోన్యంగా ఉంటే బాగుంటుందని, లేదంటే శ్రీజ మాదిరిగానే తన లైఫ్ కూడా అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో మెగా డాటర్ నిహారిక స్పందిస్తే తప్ప ఇలాంటి ఊహాగానాలకు తెరపడదు.

Read Also : Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. చిరు పెట్టిన కండిషన్ తెలిస్తే.. షాకవ్వాల్సిందే!

Advertisement
Exit mobile version