Dhee Show: గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల డాన్స్ షోలో బుల్లితెర మీద సందడి చేస్తున్నాయి. డాన్స్ షో ల ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న డాన్సర్లు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందారు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ పొందిన డాన్స్ షోలలో ఢీ డాన్స్ షో కూడా ఒకటి. ఈ డాన్స్ షో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ టీవిలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ఎప్పుడు ఏదో ఒక కారణం చేత వార్తల్లో నిలుస్తుంది.
శేఖర్ మాస్టర్ స్థానంలో గణేష్ మాస్టర్ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన పూర్తిస్థాయిలో పర్మినెంట్ గా ఉండటం లేదు. అప్పుడప్పుడు జానీ మాస్టర్ ని గెస్ట్ జడ్జ్ గా ఆహ్వానిస్తున్నారు. ఇక మరొక జడ్జి ప్రేమని గత సీజన్ నుండి ఇప్పుడు కూడా జడ్జిగా కొనసాగుతూనే ఉంది. మూడవ జడ్జిగా శ్వేతా నందిత వ్యవహరిస్తోంది. అయితే డాన్స్ పట్ల ఎటువంటి అవగాహన లేని ఈ హీరోయిన్ ప్రముఖ డాన్స్ షోలో న్యాయనిర్ణేతగా ఉండటం వల్ల ఈ షో విమర్శలను ఎదుర్కోవల్సి వస్తోంది. పైగా గణేష్ మాస్టర్ కూడా పర్మనెంట్ గా లేకపోవటంతో ఈ షో రేటింగ్స్ మరింత పడిపోయాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి పర్మనెంట్ జడ్జి లేకపోవడంతో మల్లెమాల వారి పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.
