G
Telugu News » Entertainment » varalaxmi sharath kumar tested corona positive
⚡ Entertainment, Latest, Trending

Varalaxmi sharathkumar : వరలక్ష్మీ శరత్ కుమార్ కు కరోనా.. వీడియో షేర్ చేసిన నటి!

Varalaxmi sharathkumar: హీరోయిన్ వరలక్ష్మీ ,శరత్ కుమార్ కు కరోనా సోకిందట,వీడియో షేర్ ,telugu news, corna positive to varalaxmi,corona positive

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Varalaxmi sharathkumar : ప్రముఖ నటి, హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు కరోనా సోకిందట. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో.. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందట. ఈ విషయాన్నే ఆమే స్వయంగా తెలిపారు. కరోనా మహమ్మారి ఇంకా మన చుట్టూనే తిరుగుతుందని.. దయచేసి అందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరుతూ ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ.. తనకు కొవిడ్ సేకిందని చెప్పారు. తనను ఈ మధ్య కాలంలో కలిసిన ప్రతీ ఒక్కరూ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అలాగే షూటింగ్ సెట్ లో ఉండే ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలిపారు.

Varalaxmi sharath kumar tested corona positive

వరలక్ష్మికి కరోనా సోకిందన్న విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ.. పోస్టులు పెడుతున్నారు. అయితే ఆస తల్లి నటి రాధిక స్పందిస్తూ.. జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఓ పోస్టు పెట్టారు. అయితే వరలక్ష్మీ.. హీరోయిన్ గా, లేడీ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక తెలుగులో తెనాలి రామకృష్ణ, క్రాక్, నాంది సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమె యశోద, హనుమాన్, ఎన్ బీకే 107, శబరి తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks..
Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked..
Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a

— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022

Advertisement


Read Also :  Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో స్టార్‌మా జోడీలు.. మల్లెమాల స్కెచ్ మామూలుగా లేదుగా.. పర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించారు..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷corna positive to varalaxmiVaralaxmi sharathkumarVaralaxmi sharathkumar latest newsVaralaxmi sharathkumar tested corona positive
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు