Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sudigali sudheer: చిత్రతో కలిసి అందం హిందోళం పాటతో అదరగొట్టిన సుధీర్..!

Sudigali sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగానే మన మదిలో ఎన్నెన్నో మెదులుతాయి. మ్యాజిషీయన్, యాంకర్, కమెడియన్, డ్యాన్సర్, సింగర్ ఇలా అన్నింట్లో ఆయన ముందుంటారు. చివరకు హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కున్నాడు. అయితే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరమైన సుధీర్.. అనతి కాలంలోనే టాప్ కమెడియన్ గా, యాంకర్ గా ఎదిగాడు. టీవీ షోల టీఆర్పీ పెంచాలంటే ఆ కార్యక్రమలో సుడిగాలి సుధీర్ ఉండాలని అనే స్థాయికి చేరుకున్నాడు. అయితే జబర్దస్త్ కు బై చెప్పి వెళ్లిపోయిన ఇతడు… శ్రీదేవి డ్రామా కంపెనీ, సింగింగ్ షోలో యాంకర్ గా చేశాడు. పలు వివాదాల తర్వాత జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.

స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షోలో అనసూయ భరద్వాజ్ తో కలిసి సుధీర్ రచ్చ చేస్తున్నాడు. ఇందులో లెజెండరీ సింగర్లు చిత్ర, మనోలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ శని, ఆది వారాల్లో ప్రసారం అవుతుంది. అయితే తాజాగా సుధీర్, చిత్రతో కలిసి అందం హిందోళం పాటను పాడాడు. ఈ పాట విన్న ప్రతీ ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. చాలా బాగా పాడుతున్నావూ.. నీ టాలెంట్ సూపర్ అంటూ నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి ఈ ప్రోమో చూసేయండి.

Advertisement

 

Advertisement
Exit mobile version