Radhe Shyam: రాధాకృష్ణ దర్శకత్వంలో టి సిరీస్, యు.వి క్రియేషన్స్ బ్యానర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్.ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 11వ తేదీ ఐదు భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్రబృందం ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో కూడా నిర్వహించారు.
ప్రభాస్ సినిమా కోసం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం వెనక కూడా ఓ పెద్ద కారణం ఉంది.ప్రభాస్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ది కావడంతో ఈ సినిమాని ఇతర దేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాధేశ్యాం చిత్రాన్ని తమిళనాడుతో పాటు మలేషియా వంటి దేశాలలో కూడా ఉదయనిది స్టాలిన్ విడుదల చేస్తుండడం గమనార్హం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.