Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Surveen Chawla : బోల్డ్ బ్యూటీ సుర్వీన్ చావ్లాను అంత మాటన్న ఫేమస్ డైరెక్టర్..!

Surveen Chawla : Actress Surveen Chawla Reveals Casting Couch Experience about Director Misbehaving

Surveen Chawla : Actress Surveen Chawla Reveals Casting Couch Experience about Director Misbehaving

Surveen Chawla : సినిమా ఇండస్ట్రీలో ఉండే వేధింపులపైన మీటూ ఉద్యమం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చాలా మంది హీరోయిన్స్ తమకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పారు. ఈ క్రమంలోనే సుర్వీన్ చావ్లా తనకు జరిగిన చేదు ఘటన గురించి తాజాగా షేర్ చేసుకుంది. ఇంగ్లిష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన క్రమంలో అవకాశాల కోసం వెళ్లినపుడు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయని అంది. అవకాశం ఇస్తానని పిలిచి ఓ దర్శకుడు తొడలు చూపించాలని అడిగాడని, అసహ్యంగా బిహేవ్ చేశాడని తెలిపింది. సౌత్ ఇండియా‌కు చెందిన ఓ ఫేమస్ డైరెక్టర్ అలా చేశాడని చెప్పింది.

ఆడిషన్ ఉందని పిలిచి హోటల్ రూమ్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడని గుర్తు చేసుకుంది.
తన నడుము ఫొటోలు బాగున్నాయని పేర్కొంటూనే తన నడుమును తాకే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఇక అవతలి వ్యక్తి ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి వెంటనే అర్థం చేసుకుని తనకు వేరే పని ఉందని చెప్పి మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశానని చెప్పింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులు తాను చాలా బాధపడ్డానని అయితే, ఆ తర్వాత రియలైజ్ అయి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది.

Advertisement

ఇక అలా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని హీరోయిన్‌గా సెటిల్ అయ్యానని, తనకు మంచి పేరు వచ్చిందని తెలిపింది. తాను ఇప్పుడు మంచి హోదాలో ఉన్నానని అంది సుర్వీన్ చావ్లా. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన దర్శకులు తనకు మంచి పాత్రలను ఇచ్చారని, వాటి ద్వారా సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నానని చెప్పిన సుర్వీన్ చావ్లా.. తన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెప్పింది.

Read Also : Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!

Advertisement
Exit mobile version