G
Telugu News » Entertainment » srinivas reddy chammak chandra combination movie
⚡ Entertainment

Graham: శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర కాంబినేషన్ లో సినిమా.. ఎప్పుడో తెలుసా..?

Graham: జయ శంకర్ దర్శకత్వంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. ఈ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Graham: జయ శంకర్ దర్శకత్వంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ఆర్వి సినిమాస్ బ్యానర్ పై ఆర్వి రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సాయి కుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత శేషు మారం రెడ్డి మాట్లాడుతూ..దర్శకుడు జయశంకర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని. మిగిలిన 20 శాతాన్ని ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు జయ శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడని, ఆ సన్నివేశాలు థియేటర్ లో తప్పకుండా నవ్వులు పూయిస్తాయి అని తెలిపారు. ఈ సినిమా తర్వాత ఆయనతో మరో సినిమా చేయడానికి ప్లాన్ కూడా చేస్తున్నాను అని తెలిపారు నిర్మాత శేషు మారం రెడ్డి.

అనంతరం దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకు ఉత్సాహంతోనే అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని, తమ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్లస్ అవుతుందని తెలిపారు దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ను, అలాగే విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి ఈ సినిమాకు గ్రహమ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దర్శకనిర్మాతలు చెప్పిన విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి మరి.

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷chammak chandraGrahamjaya shankarsinivas reddy
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు