Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Singer Kousalya Covid : సింగర్ కౌశల్యకు కరోనా పాజిటివ్..

Singer Kousalya Covid : Famous Singer Singer Kousalya Tests positive for Covid

Singer Kousalya Covid : Famous Singer Singer Kousalya Tests positive for Covid

Singer Kousalya Covid : కరోనా ఎవరని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరిని పట్టిపీడుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. లేటెస్టుగా సింగర్ కౌసల్య కూడా కరోనా బారిన పడ్డారు. ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్’ నిర్ధారణ అయింది.. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. రెండు రోజుల జ్వరం వచ్చింది.

ఆ రెండు రోజులు మంచంపై నుంచి లేవలేదని తెలిపింది. అనంతరం గొంతు నొప్పి వచ్చి చాలా ఇబ్బందిగా ఉందని తెలిపింది. కరోనా మందులు తీసుకుంటున్నట్టు తెలిపింది. అందరూ కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కౌసల్య ట్వీట్ చేశారు. దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది.

కరోనా థర్డ్ వేవ్‌లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో ప్రతి రోజూ 3 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోని మూడు రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

Read Also : Akkineni Nagarjuna : ఆ మాట నేను అనలేదు.. సమంత-నాగచైతన్య విడాకుల వార్తలపై నాగార్జున క్లారిటీ

Advertisement
Exit mobile version