Shannu -Deepthi: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయట పెడుతూ సెలబ్రిటీలగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు సినిమా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో బిజీగా ఉండగా మరికొందరు వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో షణ్ముఖ్ దీప్తి సునైనా ఒకరు. ఎన్నో యూట్యూబ్ వీడియోలు,వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన వీరు నిజజీవితంలో కూడా ప్రేమలో పడ్డారు.
అయితే వీరిద్దరి నిజజీవితంలో కలుసుకోబోతున్నారు అంటే కాదనే చెప్పాలి. వీరిద్దరూ బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం కోసం ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. ఈ క్రమంలోనే టైటిల్ రేసులో ఉన్నటువంటి అఖిల్ కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అఖిల్ కోసం ఒక్కటే పోస్టులు పెట్టగా చాలామంది దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ ఒకటి కాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు కేవలం అఖిల్ కోసమే వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం.